తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

క్లీంకార ఫస్ట్‌ బర్త్‌ డే - వైరల్​గా మారిన రామ్​చరణ్​, ఉపాసన ఎమోషనల్ వీడియో - Happy Birthday Klinkara - HAPPY BIRTHDAY KLINKARA

Happy Birthday klinkara : మెగాస్టార్​ చిరంజీవి మనవరాలు, రామ్‌ చరణ్ కుమార్తె క్లీంకార పుట్టినరోజు నేడు(జూన్ 20). ఈ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాసన షేర్‌ చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

source ANI
ramcharan upasana (source ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 10:17 AM IST

Updated : Jun 20, 2024, 11:23 AM IST

Happy Birthday klinkara : మెగా పవర్ స్టార్​ రామ్‌ చరణ్ - ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకార పుట్టినరోజు నేడు(జూన్​ 20). దీంతో ఆ చిన్నారికి సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్​ స్పెషల్ విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా తన కుమార్తెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసన ఓ ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేసింది. "నా ప్రియమైన క్లీంకారకు ఫస్ట్ బర్త్​ డే విషెస్​. నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. మా జీవితాల్లో ఆనందం నింపినందుకు ధన్యవాదాలు" అంటూ ఆమె రాసుకొచ్చింది. తాను షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటికి మిలియన్‌ సార్లు చూసినట్లు తెలిపింది.

ఈ వీడియోలో చరణ్​, ఉపాసనలతో పాటు రెండు ఫ్యామిలీలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరంతా క్లీంకార పుట్టినప్పటి రోజులను గుర్తు చేసుకుని ఎమోషనల్​ అయ్యారు. గతేడాది ఉపాసన పుట్టినప్పుడు కూడా చరణ్‌ ఈ వీడియోను పోస్డ్​ చేశారు. ఇప్పుడు ఆ వీడియోనే మరోసారి ఉపాసన షేర్ చేసింది. పాప పుట్టినప్పుడు తమ ఫ్యామిలీలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో ఈ వీడియో ఆద్యంతం చూపించారు. క్లీంకార నామకరణ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ కూడా ఇందులో జత పరిచారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింలో వైరల్​గా మారింది. మెగా ఫ్యాన్స్​ దీన్ని షేర్ చేస్తూ క్లీంకారకు విషెస్ తెలుపుతున్నారు. ప్రముఖులు కూడా స్పెషల్ విషెస్‌ చెబుతున్నారు. లిటిల్ వండర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని కాజల్‌ అగర్వాల్​ చెప్పగా, హ్యాపీ బర్త్‌ డే లిటిల్ స్టార్‌ అంటూ కియారా అడ్వాణీ, రకుల్‌ ప్రీత్ సింగ్‌ రిప్లైలు ఇచ్చారు.

కాగా, క్లీంకార పేరు వెనక చాలా చ‌రిత్రే ఉంది. భార‌త్​లోని ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ట, ఒడిసా ప్రాంతాల్లో నివ‌సిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తి పొంది క్లీంకార‌గా నామ‌క‌ర‌ణం చేశారని గతంలో ఉపాసన చెప్పింది. తల్లి తండ్రులు సాధించిన ఘనతను పిల్లలకు ట్యాగ్ చేయకూడదని, ఎవరి ఘనత వారే సాధించుకోవాలని కూడా ఉపాసన పేర్కొంది.

గేమ్​ఛేంజర్​ - రామ్​చరణ్​కు బిగ్ రిలీఫ్!

RC 16 బుచ్చిబాబు, రామ్​చరణ్​ సినిమా - ఈ క్రేజీ రూమర్​ విన్నారా?

Last Updated : Jun 20, 2024, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details