Happy Birthday Keerthi Suresh : 'మహానటి' సినిమాతో ఈ తరం హీరోయిన్లలో తన ప్రత్యేకతను చాటుకున్న కీర్తి సురేశ్ 32వ వసంతంలోకి అడుగుపెట్టారు. జయాపజయాలు పక్కకుపెట్టి ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటూ సక్సెస్ సాధిస్తామనే నమ్మకంతో కెరీర్‌లో ముందుకెళ్తుంటారు.
'పైలట్స్' అనే మళయాల సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు కీర్తి. నటులు సురేశ్ కుమార్, మేనకల కుమార్తె కావడంతో ఈ అవకాశం ఆమెకు సులువుగానే వచ్చింది. ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాల్లోనూ నటించారు కూడా. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుని పూర్తి సినిమా రంగంలోనే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు కీర్తి.
మూడు సినిమాలల్లో హీరోయిన్‌గా ఎంపికై, అనంతరం ఆ చిత్రాల షూటింగ్‌లు ఆగిపోవడంతో లాంచింగ్ కష్టమైంది. ఎట్టకేలకు మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన 'గీతాంజలి'తో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అందులో గీత, అంజలి అనే డ్యూయెల్ రోల్స్ చేసి శభాష్ అనిపించుకున్నారు. 'గీతాంజలి' సక్సెస్ తర్వాత 'రింగ్ మాస్టర్' మోస్తారు పేరు మాత్రమే తెచ్చిపెట్టింది.
తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత మళ్లీ కష్టాలే. తొలి తమిళ సినిమా 'ఇదు ఎన్న యామమ్' ప్లాప్. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి సినిమా 'రెండు జళ్ల సీత' వాయిదా పడుతూనే ఉంది. అలా మూడు పరిశ్రమల్లోనూ మంచి విజయం అందుకోలేకపోవడంతో కీర్తి సురేశ్ ఐరన్ లెగ్ అంటూ ఇండస్ట్రీలో పుకార్లు మొదలయ్యాయి.
ప్రయత్నాలు ఆపని కీర్తి - రామ్ హీరోగా తెరకెక్కిన 'నేను శైలజ'తో మంచి సక్సెస్ అందుకున్నారు కీర్తి సురేశ్. అంతే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ నుంచి కూడా ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు పరిగెత్తుకొచ్చాయి. అలా కమర్షియల్ సినిమాలు చేస్తున్న సమయంలో డైరక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి చేసి నేషనల్ అవార్డును అందుకుంది.
అనంతరం నటించిన 'సామి స్క్వేర్', 'పందెం కోడి 2', లేడి ఓరియెంటెడ్ ఫిల్మ్స్ అయిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖి' సినిమాలు అంతగా సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత 'దసరా', 'మామన్నన్'తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. రీసెంట్‌గా 'సైరన్', 'రఘు తాత' సినిమాల్లో కనిపించిన కీర్తి, 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి', 'ఉప్పు కప్పురంబు' సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ 'బేబీ జాన్' అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు.