ETV Bharat / sports

ఇంగ్లాండ్‌తో వన్డేలు, టీ20లు! - అప్​కమింగ్ టోర్నీల్లో బుమ్రాకు రెస్ట్! - అందుకోసమేనా? - JASPRIT BUMRAH IND VS ENG

భారత్​కు రానున్న ఇంగ్లీష్ జట్టు - అప్​కమింగ్ టోర్నీల్లో బుమ్రాకు రెస్ట్!- అందుకోసమేనా?

Jasprit Bumrah IND vs ENG
Jasprit Bumrah IND vs ENG (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 31, 2024, 7:30 PM IST

Jasprit Bumrah IND vs ENG : ప్రస్తుతం బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమ్‌ఇండియా, సిడ్నీలో ఐదో టెస్టు తర్వాత స్వదేశానికి పయనం కానుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఇక్కడ భారత్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఈ రెండు సిరీస్‌ల్లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్ ముగిసిన వారానికే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ మొదలవ్వనుంది. ఈ క్రమంలో రానున్న సిరీస్​లకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారని సమాచారం. అయితే ఈ సారి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్‌ శర్మలకు కూడా రెస్ట్ ఇవ్వాలా లేదా అనే విషయంపై సెలక్షన్ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు నుంచే మళ్లీ ఫామ్​లోకి వచ్చేందుకు వన్డే సిరీస్‌లో ఆడాలని రోహిత్, కోహ్లీ ఆసక్తితో ఉన్నట్లుగా క్రికెట్ వర్గాల మాట.

ఇదిలా ఉండగా, ఈ మధ్య బుమ్రాపై పనిభారం ఎక్కువవుతోంది. మెల్‌బోర్న్‌ టెస్టులో అతడు ఏకంగా 53.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. జనవరి 3 నుంచి ఆసీస్, భారత్ మధ్య సిడ్నీలో ఐదో టెస్ట్ ప్రారంభం కానుండగా, ఇందులో బుమ్రా ఆడితే అతడు నాలుగు నెలల వ్యవధిలోనే 10 టెస్టులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఆసీస్ పర్యటనలో ఇప్పటివరకు 141.2 ఓవర్లు బౌలింగ్‌ చేసి 30 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తీసుకోని ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లలో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

భారత్, ఇంగ్లాండ్ ఐదు టీ20ల సిరీస్ షెడ్యూల్ ఇదే :
జనవరి 22 - తొలి టీ20 (కోల్‌కతా)

జనవరి 25 - రెండో టీ20 చెన్నైలో

జనవరి 28 - మూడో టీ20 (రాజ్‌కోట్‌)

జనవరి 31 - నాలుగో టీ20 (పుణె)

ఫిబ్రవరి 2 - ఐదో టీ20 (ముంబయి)

వన్డే సిరీస్ షెడ్యూల్
ఫిబ్రవరి 6 - తొలి వన్డే (నాగ్‌పుర్)

ఫిబ్రవరి 9 - రెండో వన్డే (కటక్)

ఫిబ్రవరి 12 - మూడో వన్డే (అహ్మదాబాద్)

క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన - కెప్టెన్​గా బుమ్రా! - టెస్ట్​ టీమ్​ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్​!

బుమ్రా బౌలింగ్​లో సిక్స్ కొట్టిన ప్లేయర్లు- ​8570 బంతుల్లో 9 సార్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.