Gurukul schools Admissions 2025-26 : 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలల్లో చేపట్టే అడ్మిషన్లకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అయితే ఈ ఏడాది చేరికల్లో కొన్ని మార్పులను చేసింది. గతంలో ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నెంబర్ ఉంటే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది నుంచి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ముందే సమర్పించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం : గతంలో 5 తరగతికి ఒకసారి, 6 నుంచి 9 తరగతుల్లో అడ్మిషన్లకు మరో విడత దరఖాస్తులను స్వీకరించేవారు. ప్రవేశ అర్హత పరీక్షను సైతం వేర్వేరు తేదీల్లో నిర్వహించే వారు. ఈ ఏడాది ఐదు నుంచి తొమ్మిది క్లాస్‌లకు ఒకేసారి దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్ష నిర్వహించే ఏర్పాట్లను చేస్తోంది ప్రభుత్వం.
ఫిబ్రవరి ఒకటి చివరి గడువు : 2024 డిసెంబరు 21వ తేదీ నుంచి గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అంతర్జాలంలో దరఖాస్తు చేసుకునేందుకు చివరి 01-02-2025 వరకు ఉంది. 23 ఫిబ్రవరి 2025న ఎంపిక చేసినటువంటి కేంద్రాల్లో అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. ముఖ్యంగా 2025-26 విద్యా సంవత్సరానికి గురుకులంలో పై తరగతులకు దరఖాస్తులు చేసుకోవాలనుకునే విద్యార్థులు మీ-సేవ కేంద్రాల ద్వారా ముందుగా క్యాస్ట్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. ఈ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. అందుకే అవి మీ దగ్గర ఉంచుకోవడం ఉత్తమం. దరఖాస్తుల స్వీకరణకు ఇంకా సుమారు నెల రోజులే ఉన్నందున సర్టిఫికెట్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసుకోవడం మంచిది.
దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలివే :
- ప్రస్తుతం చదువుతున్న స్కూల్ నుంచి బోనఫైడ్ లేదా జనన ధ్రువీకరణ పత్రం జతచేయాలి.
- ఆధార్ కార్డుతో పాటు సెల్‌ఫోన్ నెంబరు ఒక దరఖాస్తుకు మాత్రమే పనిచేస్తుంది. (ఓటీపీతో లాగిన్ అయ్యేందుకు)
- విద్యార్థి పాస్‌ఫొటోతో పాటు గ్రామీణ ప్రజల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు ఉండాలి.
- పట్టణ ప్రజలైతే వారి వార్షిక ఆదాయం రూ.2లక్షల లోపు మాత్రమే ఉండాలి.
రైల్వేలో 32,000 గ్రూప్-డి జాబ్స్ - ఇలా దరఖాస్తు చేసుకోండి - చివరి తేదీ ఎప్పుడంటే?
సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేలో 4232 అప్రెంటిస్ ఖాళీలు - ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి