Happy Birthday Kajal Aggarwal : టాలీవుడ్ 'చందమామ' కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సీనియర్ అండ్ స్టార్ హీరోల నుంచి జూనియర్ హీరోలందరితోనూ నటించి ఆకట్టుకుంది. పెళ్లైన కూడా ఇంకా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. నేడు(జూన్ 19) ఈ 'మిత్రవింద' పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ జర్నీ, పర్సనల్ లైఫ్, నెట్ వర్త్ గురించి తెలుసుకుందాం.
1985లో జూన్ 19న పంజాబీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ముంబయిలో జన్మించింది కాజల్ అగర్వాల్. స్కూలింగ్ ముంబలోనే చేసింది. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసిందట. ఆ తర్వాత జై హింద్ కళాశాలలో ఇంటర్, అనంతరం మాస్ మీడియాలో గ్రాడ్యూవేషన్ చదివింది. ఆ తర్వాత ఎంబీఏ చదవాలని అనుకుంది. కానీ అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చింది.
క్యూన్ హో గయా నా(2004) చిత్రంతో అరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత 2007లో 'లక్ష్మి కళ్యాణం'(2007) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే తన యాక్టింగ్తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం 'చందమామ'తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. మగధర, గణేష్, ఆర్య 2, డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్, దడ, బాద్షా, నాయక్, గొవిందుడు అందరివాడే లే ఇలా వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. లాక్డౌన్లో పెళ్లి చేసుకుని ఓ అబ్బాయిని జన్మనిచ్చింది. రీసెంట్గా సత్యభామ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటించింది. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.