Hanuman Movie OTT: 2024 సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా నిలిచి భారీ విజయాన్ని దక్కించుకుంది హనుమాన్. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.300+ కోట్లు వసూల్ చేసి పలు రికార్డులు బ్రేక్ చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వీఎఫ్ఎక్స్తో వండర్స్ క్రియేట్ చేసి ప్రశంసలు పొందారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5 (ZEE 5) దక్కించుకుంది. ముందుగా మార్చి 2నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ (OTT Streaming) కానున్నట్లు రీసెంట్గా మేకర్స్ తెలిపారు. కానీ, కొన్ని కారణాల వల్ల హనుమాన్ మరింత ఆలస్యంగా ఓటీటీలోకి రానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న డేట్‌ను జీ 5 అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ బ్లాక్ బస్టర్ ముూవీ మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు జీ 5 శుక్రవారం తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసింది.
సినిమా విషయానికొస్తే, 2024లో తొలి బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న మూవీ హనుమాన్. హిందీలోనూ హనుమాన్ మార్క్ కనిపించింది. నార్త్‌లో రూ.40+ కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా అటు ఓవర్సీస్ (Hanuman Overseas Collection)లోనూ హనుమాన్ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లో 5 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది. దీంతో ఓవర్సీస్లో 5మిలియన్ డాలర్లు సాధించిన టాప్- 5 తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది.