Hanuman Movie Box Office Collection:అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరగుతున్న వేళ, విజువల్ వండర్స్ హను- మాన్ సినిమా ఘనమైన రికార్డ్ అందుకుంది. సూపర్‌హిట్ టాక్‌తో దుసుకుపోతున్న ఈ మూవీ రెండో వారంలోనూ అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ.209.06 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో 2024లో రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ సినిమాగా హను- మాన్ రికార్డు కొట్టింది. సోమవారం (జనవరి 22) అయోధ్యలో రామ మందింరం ప్రారంభోత్సవం సందర్భంగా యూఎస్ఏలో (USA) పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్ర్రీన్స్ (Selected Screens)లో సగం ధరకే టికెట్ విక్రయిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది.
ఆయోధ్యకు విరాళం:హమమాన్ మేకర్స్ భారీ మొత్తాన్ని అయోధ్యకు విరాళం అందించారు. ఒక్కో టికెట్‌పై రూ.5ను రామ మందిరానికి ఇవ్వనున్నట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ (జనవరి 21) 53,28,211 టికెట్లు అమ్ముడవ్వగా, వాటి ద్వారా వచ్చిన రూ.2,66,41,055ను విరాళంగా ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ప్రీమియర్ షోల నుంచి వచ్చిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే డొనేషన్ రూపంలో అందించారు.
Hanuman Movie Overseas Collection: ఈ సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా అటు ఓవర్సీస్లోనూ దూసుకెళ్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ మూవీ 4 మిలియన్ మార్క్ దాటేసింది. ఈ క్రమంలో యూఎస్ఏలో టాప్- 5 ఆల్‌టైమ్ హైయ్యెస్ట్ తెలుగు గ్రాసర్ మూవీస్ లిస్ట్‌లోకి ఎంటర్ అయ్యింది.