Naga chaitanya Sobhita Dhulipala Marriage : అక్కినేని హీరో నాగ చైతన్య - హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరి కొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంటకు హల్దీ వేడుక ఘనంగా జరిగింది. కాబోయే వధూ వరులను ఒకే చోట ఉంచి ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుక ఎంతో సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొని సందడి చేశారు. ఈ జంటకు మంగళస్నానాలు చేయించి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Marrige Celebrations Start ayinattu unnai🥰
— Naa Peru Shivamani (@Shivamani198) November 28, 2024
Anna @chay_akkineni Eeewww🥳😝
Happy Married Life In Advance Both Of You Anna Vadina @sobhitaD 💕💕#NagaChaitanya #SobhitaDhulipala #ChaySo pic.twitter.com/Qk0FkGXdK9