ETV Bharat / offbeat

మీ నిమ్మచెట్టు ఎదగడం లేదా? - ఈ టిప్స్​ పాటిస్తే కాయలు పుష్కలంగా కాస్తాయి! - TIPS TO GROW LEMON PLANT NATURALLY

- నిమ్మ మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఇలా చేయండి

Lemon Plant Growing Tips
Lemon Plant Growing Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 9:45 AM IST

Lemon Plant Growing Tips : మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఇంటి అవసరాల కోసం చాలా మంది త‌మ త‌మ ఇళ్లలో ర‌క‌ర‌కాల మొక్క‌ల‌ను పెంచుతుంటారు. అందులో నిమ్మ కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇంట్లో కుండీల్లో లేదా పెర‌ట్లో పెంచుతుంటారు. నిమ్మకాయ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే.. కొన్ని సార్లు వివిధ కారణాల వ‌ల్ల నిమ్మ చెట్లలో ఎదుగుదల ఉండదు. మరికొన్ని చెట్లు ఏపుగా పెరిగినా.. కాయ‌ల‌ు మాత్రం కాయవు. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉంటాయని.. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవ‌డం వ‌ల్ల చెట్టు ఆరోగ్యంగా పెరిగి కాయ‌లు కాస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పోష‌కాలు కావాలి: మ‌నం ఇంట్లో లేదా పెర‌ట్లో పెంచే ఏ మొక్కకైనా స‌రైన పోష‌ణ అవ‌స‌రం. అప్పుడే అవి ఏపుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ క్రమంలోనే నిమ్మ చెట్ల‌కు కూడా పోషకాలు అవసరమే. వాటిల్లో పొటాషియం, నైట్రోజ‌న్‌, ఫాస్ఫ‌ర‌స్ త‌దిత‌రాలు ముఖ్య‌మైన‌వి. ఈ పోషకాలు సరిపడా నిమ్మ చెట్టుకు అందితే పుష్కలంగా కాయ‌లు కాస్తాయంటున్నారు.

సరైన ప్రదేశంలో పెట్టాలి: నిమ్మ‌చెట్టును పెంచేందుకు స‌రైన సూర్య‌కాంతి కావాలని నిపుణులు అంటున్నారు. కుండీల్లో పెంచితే సూర్యకాంతి ప‌డే చోట వాటిని పెట్టాలని.. అదే పెరట్లో నాటితే సూర్యకిరణాలు పడే ప్రదేశంలో నాటాలని చెబుతున్నారు. సూర్య కాంతి సరిగా ఉంటే నిమ్మ చెట్టు పెరుగుతుందని.. కాయ‌ల‌ను కాస్తుందని అంటున్నారు. తగినంత సూర్య‌కాంతి లేకపోతే కాయ‌లు త‌క్కువ‌గా వ‌స్తాయని లేదా కొన్ని సార్లు చెట్లకు కాయలే ఉండకపోవచ్చంటున్నారు.

నీరు తగినంత ఉండాలి: నిమ్మ‌చెట్టుకు పూత ఏర్పడినప్పుడు దానికి స‌రైన నీరు, పోష‌కాలు అందేలా చూడాలని.. దీంతో పూత రాలిపోకుండా ఉండి కాయలు ఎక్కువ‌గా కాస్తాయంటున్నారు. పూత వచ్చిన సమ‌యంలో నీరు సరిపడా లేక‌పోయినా, పోష‌కాలు అంద‌క‌పోయినా పూత రాలుతుందని.. కాపు తక్కువగా ఉంటుందంటున్నారు.

బోరాన్​ లోపం ఉంటే: నిమ్మ‌చెట్లు ఏపుగా పెరిగిన‌ప్ప‌టికీ కాయ‌లు కాయ‌క‌పోతే అప్పుడు బోరాన్ లోపంగా భావించాలని.. ఈ సమయంలో బోరాన్​ పొడిని చల్లడం వల్ల ఫలితం ఉంటుందని అంటున్నారు. ఆన్‌లైన్‌ మార్కెట్​ లేదా బ‌య‌ట కిరాణా షాపుల్లోనూ బోరాన్ ల‌భిస్తుందని.. దీన్ని తెచ్చి ప్యాకెట్ల‌లో పెట్టి మట్టిలో ఉంచాలంటున్నారు. దీంతో నిమ్మ చెట్ల‌కు బోరాన్ ల‌భిస్తుందని.. కాయ‌లు చ‌క్క‌గా వ‌స్తాయంటున్నారు.

సరైన కుండీలు: నిమ్మ చెట్ల‌ను పెంచే కుండీలు మ‌రీ చిన్న‌గా ఉండ‌కుండా.. కాస్త పెద్ద‌గా ఉండే కుండీలనే ఎంచుకోవాలంటున్నారు. అలాగే 3 రోజులకు ఒక‌సారి ప‌లుచ‌ని మజ్జిగ‌ను కాస్త పోస్తుండాలని.. దీంతోపాటు బ‌య‌ట మార్కెట్‌లో ల‌భించే సేంద్రీయ ఎరువుల‌ను వేస్తుండాలని చెబుతున్నారు. ఇలా కొన్ని చిట్కాలను పాటించ‌డం వ‌ల్ల నిమ్మ చెట్ల‌కు కాయ‌లు చ‌క్క‌గా వ‌స్తాయంటున్నారు.

మొక్కలు ఏపుగా పెరగాలంటే రసాయనాలే అవసరం లేదు! - ఈ పదార్థాలు వేసినా చాలు!

ఈ ఇండోర్‌ ప్లాంట్స్‌తో ఇంటికి వాస్తు, అందం - మనకు ఆనందం, ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.