తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

70 ఏళ్ల నటుడితో 31 ఏళ్ల నటి రిలేషన్​షిప్!​ - హాట్​టాపిక్​గా మారిన జంట!! - ACTOR RELATIONSHIP RUMOUR

బాలీవుడ్ హాట్​టాపిక్​గా మారిన ఓ జంట రిలేషన్​షిప్​! - ట్రోల్స్​ చేస్తోన్న నెటిజన్లు.

Govind Namdev Shivangi Verma Relationship
Govind Namdev Shivangi Verma Relationship (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2024, 6:24 PM IST

Govind Namdev Shivangi Verma Relationship : సినీ ఇండస్ట్రీలో రిలేషన్​షిప్స్​ అనేవి సర్వ సాధారణం అని చాలా మంది అంటుంటారు! హీరో, హీరోయిన్ల మధ్య లేదా ఇతర యాక్టర్ల మధ్య రిలేషన్​షిప్స్​ కొనసాగుతుంటాయి. ఇక్కడితో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని కూడా చెబుతుంటారు. అయితే తాజాగా ఓ కొత్త రిలేషన్ రూమర్​ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్​గా మారింది. ఓ 70 ఏళ్ల న‌టుడితో 31 ఏళ్ల నటి ప్రేమయాణం సాగిస్తోందని అంతా తెగ మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ వాళ్లెవరంటే? - బుల్లితెర నటి శివాంగి వర్మ (31 ఏళ్లు), తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ, బాలీవుడ్ ఆడియెన్స్​కు సుపరిచితురాలే. కొన్ని సినిమాల్లోనూ ఆమె నటించింది. సోషల్ మీడియాలోనూ ఫుల్​ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఈ భామ సీనియర్ నటుడు గోవింద్ నామ్ దేవ్‌తో (70 ఏళ్లు) ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. ఎటువంటి హద్దులు ఉండవు' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందా? అని చాలా మంది షాక్ అయ్యారు. వాళ్లను ట్రోల్ చేశారు. 'లేటు వయసులో యంగ్ బ్యూటీతో రొమాన్స్ ఏంటి, ముసలివాడితో ప్రేమ ఏంటి?' అంటూ ప్రశ్నించారు. మరికొంతమంది ఇదేమైనా పబ్లిసిటీ స్టంటా అని కూడా భావించారు.

స్పందించిన గోవింద్ నామ్​దేవ్​ - అయితే ఈ విషయంపై గోవింద్ స్పందించారు. ఇదంతా నిజం కాదని స్పష్టత ఇచ్చారు. అది కేవలం సినిమా ప్రమోషన్ కోసం చేసిందని క్లారిటీ ఇచ్చారు. "ఇది రియల్ లైఫ్ లవ్ కాదు, రీల్ లవ్. గౌరీశంకర్ గోహర్​గంజ్​ వాలే అనే సినిమా కోసం ప్రస్తుతం ఇందోర్​లో షూటింగ్ చేస్తున్నాం. మా సినిమా స్టోరీ ప్లాట్ ఏంటంటే? వయసు పైబడిన వ్యక్తి, యువ నటితో ప్రేమలో పడటమే. ప్రస్తుతం రియల్ లైఫ్​లో ఓ యువ నటితో ప్రేమలో అంత ఈజీ కాదు. నా జీవితంలో నా భార్య సుధ ఉంది. నేను ఆమెను ప్రేమించినంతగా ఇంకెవరినీ లవ్ చేయలేను" అని చెప్పుకొచ్చారు. కాగా, గోవింద్ నామ్​దేవ్​ ఓమైగాడ్​, బండిట్​ క్వీన్, సత్య, సింగం వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. తాను పోషించిన పాత్రలపై మంచి ప్రభావం చూపించారు.

శివాంగి వర్మ కూడా ఈ విషయంపై స్పందించింది. సినిమాలోని తన పాత్ర, రియల్ లైఫ్​తో పోలిస్తే పూర్తి భిన్నం అని తెలిపింది. పాత్ర కోసం మానసికంగా సిద్ధం అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకోసం ఎక్కువ సమయాన్ని దర్శకుడు, రైటర్, ఇతర మూవీటీమ్​తో గడుపుతున్నట్లు వెల్లడించింది.

'పుష్ప 2'లో ఈ డిలీటెడ్ డైలాగ్ విన్నారా? - సినిమాలో పెట్టుంటే 'రప్పారప్పా'నే!

'నన్ను నమ్మండి' - లీక్డ్​ ఫొటోపై 'రాజాసాబ్' బ్యూటీ నిధి అగర్వాల్​ రియాక్షన్

ABOUT THE AUTHOR

...view details