తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గూగుల్ సెర్చ్​ ట్రెండ్స్​ 2024 - టాప్​లో పవన్ కల్యాణ్​, IPL! - GOOGLE 2024 SEARCH TRENDS

గూగుల్ సెర్చ్​ ట్రెండ్స్​ 2024లో టాప్ ప్లేస్​లో ఏయే టాపిక్స్ ఉన్నాయంటే?

Google 2024 search trends
Google 2024 search trends (ETV Bharat, Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2024, 7:54 PM IST

Google 2024 Search Trends : మనం ఏదైనా ఓ విషయం గురించి తెలుసుకోవాలంటే ఆటోమెటిక్​గా మనకు గూగుల్​ గుర్తొస్తుంది. అందులో సెర్చ్ చేస్తే ఆ విషయానికి సంబంధించిన సమగ్ర సమచారం దొరుకుతుందని నమ్మకం. ఏజ్​తో సంబంధం లేకుండా నెట్టింట చాలా వరకూ గూగుల్​పైనే ఆధారపడుతుంటారు నెటిజన్లు. మరి ఈ ఏడాది మొత్తం మన భారతీయులు ఎక్కువ ఏ టాపిక్​ గురించి వెతికారో తెలుసా? అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

సినిమాల్లో ఆ హీరో గురించి, క్రికెట్​లో​ అయితే!
2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను మంగళవారం ప్రచురించింది. అయితే అందులో ఈ ఏడాది అత్యధికంగా వెతికన టాపిక్స్​లో క్రికెట్ లవర్స్​ ఎంతో ఇష్టంగా చూసే ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ టాప్​లో ఉన్నాయి. అయితే వీటితో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలూ ఉన్నాయని తెలుస్తోంది. దివంగత టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా గురించి కూడా చాలా మంది నెటిజన్లు సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే మూవీ లవర్స్ మోస్ట్ సెర్చ్​డ్​ టాపిక్ లిస్ట్​లో బాలీవుడ్ మూవీ 'స్త్రీ2' పేరు టాప్​లో ఉంది. ఇక ప్రభాస్‌ నటించిన 'కల్కి 2898 AD', 'సలార్‌' గురించి ఎక్కువ మంది సెర్చ్‌ చేశారని గూగుల్ వెల్లడించింది. వీటితో పాటు ప్రశాంత్‌ వర్మ - తేజా సజ్జా కాంబోలో తెరకెక్కిన 'హనుమాన్‌' కూడా ఈ లిస్ట్​లో ఉంది. 'మీర్జాపూర్‌', 'హీరామండీ' షోస్ గురించి కూడా గూగుల్​లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు తేలింది.

రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్‌ ఫొగాట్‌ గురించి కూడా చాలా మంది వెతికారని గూగుల్‌ వెల్లడించింది. ముఖ్యంగా మెస్ట్​ సెర్చ్​డ్​ పర్సన్స్​ లిస్ట్​లో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. బిహార్‌కు చెందిన నీతీశ్‌ కుమార్‌, చిరాగ్‌ పాసవాన్‌ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్ చేశారని తెలుస్తోంది.

మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా టాప్‌ సెర్చ్‌​లో ఉన్నారు. వ్యక్తుల లిస్ట్​లో ఆయన ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇవి కాకుండా ఎక్కువగా సెర్చ్‌ చేసిన మీమ్స్‌, మీనింగ్స్, దగ్గర్లోని ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు వంటి వాటితో గూగుల్ ఈ నివేదికను సిద్ధం చేసింది. వాటిని కూడా ఓ లుక్కేయండి మరి

IPLలో లోకల్ కుర్రాళ్లు- హోం టీమ్స్​కు ఆడనున్న ప్లేయర్లు వీళ్లే!

'హరిహర వీరమల్లు' షూటింగ్‌ అప్డేట్ - ఫైనల్ షెడ్యూల్​ కోసం పవన్ రెడీ

ABOUT THE AUTHOR

...view details