Game On Movie OTT : ఓటీటీలోకి ఎన్నో రకాల జానర్ సినిమాలు తెరపైకి వచ్చి సందడి చేస్తుంటాయి. తాజాగా ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు మరో కొత్త సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. అదే గేమ్ ఆన్. గతంలో బ్లూ వేల్ అనే ఆన్ లైన్ కిల్లర్ గేమ్‌కు బానిసై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఛాలెంజ్‌లు విసురుతూ ఆత్మహత్యకు ప్రేరేపించే ఈ ఆటను అప్పట్లో చాలా దేశాల్లోనూ బ్యాన్ చేశారు. దీనినే కథా నేపథ్యంగా తీసుకుని కాస్త అటూ ఇటూ మార్చి తాజాగా తెరకెక్కించిన చిత్రమే గేమ్ ఆన్. రీసెంట్‌గానే బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన ఈ చిత్రం అప్పుడు నెల తిరగకుండానే సైలెంట్‌గా స్ట్రీమింగ్కు కూడా వచ్చేసింది. వచ్చీ రాగానే మంచి రెస్పాన్సే అందుకుంటోంది.
ఈ చిత్రంలో గీతానంద్, నేహా సోలంకి ప్రధాన పాత్రల్లో నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసి కథ పరంగా ఇంట్రెస్ట్‌గానే ఉన్నా ఎందుకో థియేటర్లలోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇప్పుడు సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో దర్శనమిచ్చింది. సినిమాలో పలు పాత్రలు ఉన్నప్పటికీ ప్రధానంగా రెండు పాత్రల మధ్యే ఈ స్టోరీ ఎక్కువగా నడుస్తుంది.