Game Changer Movie North Rights : తమిళ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. కమల్ హాసన్‌తో భారతీయుడు 2, అలాగే రామ్ చరణ్ తేజ్‌తో 'గేమ్ ఛేంజర్' ఇలా రెండూ భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలను ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడు లేనిది తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వస్తుండటం వల్ల అభిమానుల్లో ఆయన లైనప్‌పై మరింత ఆసక్తి పెరిగింది. పైగా రెండూ స్టార్ హీరోల సినిమాలు అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలకు గట్టి పోటీనివ్వనుంది. సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ వీటిపై హై ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి.
ఇలా భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ మూవీస్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' నార్త్ థియేటర్ రైట్స్ రూ. 75 కోట్లకు అమ్ముడుపోయిందట. గ్లోబల్ స్టార్‌కు నార్త్‌లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా అక్కడ ఆ రేంజ్లో క్లిక్ అయ్యింది. అంతే కాకుండా ఈ స్టోరీ లైన్ కూడా చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది.
అయితే ఎప్పుడో అనౌన్స్ చేసిన 'భారతీయుడు 2' థియేటర్ రైట్స్ డీల్ మాత్రం రూ.20 కోట్లకు మించలేకుండా పోయింది. భారతీయుడు 2 చిత్రానికి అట్రాక్ట్ చేసే అప్డేట్స్ లేవు. పైగా ఆ సినిమా షూటింగ్ చాలా ఏళ్లుగా సాగుతుంది. ఆ ఫిల్మ్ పై క్రేజీ పెంచే ప్రయత్నాలు ఏవీ ఆ మూవీ టీమ్ చేయకపోవడం కూడా మార్కెట్ పెరగకపోవడానికి కారణమని విశ్లేషకుల మాట. గేమ్ ఛేంజర్ కనీసం అక్టోబర్లోనో లేకుంటే దీపావళికి వచ్చే అవకాశం ఉందని అనౌన్స్ చేశారు.