తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గేమ్​ఛేంజర్' కొత్త పోస్టర్ రిలీజ్- ఈసారి అప్డేట్ ఏంటంటే? - Game Changer Update - GAME CHANGER UPDATE

Game Changer Second Song : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.

Game Changer Update
Game Changer Update (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 4:40 PM IST

Updated : Sep 25, 2024, 5:00 PM IST

Game Changer Second Song :గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. మేకర్స్ ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ప్రోమో రిలీజ్ డేట్​ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్​రో హీరో రామ్​చరణ్ ఫార్మల్ ఔట్​ఫిట్​లో క్లాస్​గా కనిపిస్తున్నారు. 'పండగ మొదలైంది. రెండో పాట ప్రోమో రా మచ్చమచ్చ సెప్టెంబర్ 28న విడుదల కానుంది' అని క్యాప్షన్ రాసుకొచ్చారు. లిరిసిస్ట్​ అనంత్ శ్రీరామ్ ఈ పాట తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా, గతంలో రిలీజైన తొలి పాట 'జరగండి జరగండి'కి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ పాటలో రామ్​చరణ్- కియారా అడ్వాణీ లుక్స్, డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

రిలీజ్ అప్పుడేనా?
రీసెంట్​గా మ్యూజిక్ డైరెక్టర్​ తమన్‌ విడుదల తేదీపై హింట్ ఇచ్చారు. తన తాజా పోస్ట్​తో రిలీజ్​ డేట్​ను ఇండైరెక్ట్​గా కన్ఫార్మ్​ చేశారు. 'వచ్చే వారం నుంచి డిసెంబరు 20 వరకు ప్రచార చిత్రాలు, ఈవెంట్స్‌ ఉంటాయి. రెడీగా ఉండండి' అని పోస్ట్​కు రాసుకొచ్చారు. అలానే నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ కూడా తమన్‌ పోస్ట్‌ను రీ పోస్ట్‌ చేసి ఫ్యాన్స్​లో మరింత జోష్ పెంచింది. దీంతో మెగా ఫ్యాన్స్​, సినీ ప్రియులు గేమ్ ఛేంజర్​ డిసెంబరు 20న రిలీజ్ అవ్వనుందని ఫిక్స్ అయిపోయారు. కానీ, అఫీషియన్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

గేమ్​ఛేంజర్​తో నా కల నిజం
ఈ సినిమా​ గురించి దర్శకుడు శంకర్ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడారు. 'నేను తీసిన తమిళ సినిమాలకు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ దక్కింది. అందుకే డైరెక్ట్​గా తెలుగులోనే ఓ మూవీ చేయాలని ఎప్పుడూ అనుకునే వాడిని. అప్పటికీ చేసిన కొన్ని ప్రయత్నాలు ఫెయిల్​ అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఇప్పుడు 'గేమ్‌ ఛేంజర్‌'తో నా కల నెరవేరుతోంది. కార్తీక్ సుబ్బరాజు అందించిన కథతో దీన్ని తెరకెక్కిస్తున్నాను. ఇది పక్కా ఫుల్​ యాక్షన్‌ మోడ్ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్‌ మూవీ వచ్చి చాలా కాలం అయిపోయింది' అని ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2024 డిసెంబర్​లో రిలీజ్ కానుంది.

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్​ చెప్పిన తమన్ - SS Thaman Game Changer

'గేమ్​ ఛేంజర్'​ రిలీజ్ డేట్ - క్లారిటీ ఇచ్చిన తమన్​ - Game Changer Release Date

Last Updated : Sep 25, 2024, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details