తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్​చరణ్ బర్త్ డే స్పెషల్- 'జరగండి' సాంగ్ వచ్చేసిందోచ్​- చెర్రీ, కియారా స్టెప్పులు చూశారా? - Game Changer Jaragandi Song - GAME CHANGER JARAGANDI SONG

Game Changer Jaragandi Song: గ్లోబల్​ స్టార్ రామ్​చరణ్- కియారా అడ్వాణీ లేటెస్ట్ మూవీ గేమ్​ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ బుధవారం రిలీజైంది.

game changer jaragandi song
game changer jaragandi song

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 9:54 AM IST

Updated : Mar 27, 2024, 11:11 AM IST

Game Changer Jaragandi Song:గ్లోబల్​ స్టార్ రామ్​చరణ్- కియారా అడ్వాణీ లేటెస్ట్ మూవీ గేమ్​ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ బుధవారం రిలీజైంది. మార్చి 27న హీరో రామ్​చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్​ ఈ 'జరగండి' సాంగ్​ను విడుదల చేశారు. ఈ పాటకు చెర్రీ, హీరోయిన్ కియారాతో స్టెప్పులు అదరగొట్టేశారు. ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్​కు ఇది ఓ ట్రీట్ అనే చెప్పవచ్చు.

ఇక డైరెక్టర్ శంకర్​ ఈ పాటను చాలా గ్రాండ్​గా డిజైన్ చేశారు. నేచురల్ లుక్ కోసం ప్రత్యేకంగా ఈ సెట్ వేశారు. దీనికి కోసం మేకర్స్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాక్​గ్రౌండ్ సెట్స్, విజువల్ వర్క్స్​ అదిరిపోయాయి. రియల్ లొకేషన్​లోనే సాంగ్ షూట్ చేసినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్​చరణ్- కియారా లుక్స్​, స్క్రీన్ ప్రెజెన్స్ సాంగ్​కు హైలైట్​గా నిలిచాయి. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ, స్టిల్స్​, కాస్ట్యూమ్​కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రచయిత అనంత శ్రీరామ్ పాటకు లిరిక్స్ అందించగా ఎప్పటిలాగే తమన్ మ్యూజిక్​ ఇరగదీశారు. డ్యాన్స్​ మాస్టర్ ప్రభుదేవా 'జరగండి' సాంగ్​కు కొరియోగ్రఫి చేపట్టారు. ఇక రామ్​చరణ్​కు బర్త్​ డే విషెస్ చెప్తూ, సాంగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్​ కామెంట్ చెస్తున్నారు. ఇక ఈరోజే 'జరగండి' తమిళ్ వెర్షన్ సాంగ్ కూడా రిలీజైంది.

Game Changer Cast: కాగా, 'గేమ్ ఛేంజర్' సినిమా విషయానికొస్తే ఇందులో రామ్​చరణ్ రాజకీయ నాయకుడు, ఐఎఎస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్​గా వైజాగ్​లో షూటింగ్ జరిగింది. ఇక ఈ సినిమాలో నటి అంజలీ, SJ సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్​రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై శిరీశ్​తో సంయుక్తంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని 2024 చివర్లో థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గ్లోబల్ స్టార్​ రామ్​ చరణ్​కు అదంటే చాలా భయమట! - Ramcharan Happy Birthday

'గేమ్​ఛేంజర్'​ కోసం ​చరణ్ డేంజరస్​​ రిస్క్​ - 12 గంటలకు పైగా అక్కడే ఉండి!

Last Updated : Mar 27, 2024, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details