తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అంజి టు గోట్ లైఫ్​ - ఈ టాప్ 5 సినిమాలు ఎందుకు లేట్​గా రిలీజ్ అయ్యాయో తెలుసా? - FILMS WITH LONGEST SHOOT TIME

భారత సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆలస్యంగా పూర్తయిన 5 సినిమాలు ఏవంటే?

5 Indian Films That Took the Longest to Complete
Indian Films That Took the Longest to Complete (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2024, 4:06 PM IST

5 Indian Films With Longest Shoot Time :కాగితంపై రాసుకున్న కథను, ఊహల్లోని దృశ్యాలను వెండి తెరపై ఆవిష్కరించడం అంత సులువు కాదు. దర్శకుల ప్రతిభ మాత్రమే కాదు ఇతర అన్ని బృందాల సహకారం చాలా అవసరం. ఇవన్నీ కుదిరినా సరే ఓ సినిమాని పూర్తిచేసి, థియేటర్‌కి తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది. అదే ఆర్థిక ఇబ్బందులు, క్రియేటివ్‌ సమస్యలు, టెక్నాలజీ ఇష్యూస్ వంటి సమస్యలు తలెత్తితే ఇంకా ఆలస్యం అవుతుంది.

అయితే భారత సినిమా రంగంలో అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే పూర్తి చేయడానికి ఎక్కువ సంవత్సరాలు తీసుకున్న టాప్ 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అంజి
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'అంజి' సినిమా కూడా చాలా కాలం తర్వాత రిలీజ్‌ అయింది. 2000లో ప్రకటించినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం చాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవసరమైంది. దీంతో విడుదల తేదీ 2002 నుంచి 2004కి వెళ్లింది. 3డి డిజిటల్ గ్రాఫిక్స్‌ వల్ల ఈ సినిమా విడుదలయ్యేందుకు ఆరేళ్ల సమయం తీసుకుంది. అయితే స్పెషల్ ఎఫెక్ట్స్‌కు అవార్డులు గెలుచుకున్నప్పటికీ, అధిక నిర్మాణ వ్యయం కారణంగా 'అంజి'కి బాక్సాఫీస్ వద్ద కష్టాలు తప్పలేదు.

బ్రహ్మాస్త్ర: పార్ట్‌ వన్‌- శివ
అయాన్ ముఖర్జీ ప్రతిష్టాత్మక ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర పూర్తి కావడానికి ఏడేళ్లు పట్టింది. 2014లో సినిమా ప్రకటించారు, 2016లో విడుదల అవుతుందని భావించారు. అయితే షెడ్యూల్ కుదరకపోవడం వల్ల, అలాగే కోవిడ్-19, విజువల్ ఎఫెక్ట్‌ సవాళ్ల కారణంగా విడుదల మరింత ఆలస్యమైంది. చివరికి బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ 2022 సెప్టెంబర్ 9న విడుదలైంది.

ధ్రువ నచ్చతిరమ్: ఛాప్టర్‌ వన్‌– యుద్ధ కాండం

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ తెరకెక్కించిన 'ధ్రువ నచ్చతిరమ్' సినిమాను తొలుత హీరో సూర్యతో తీస్తున్నట్లు 2013లో ప్రకటించారు. అయితే క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. కానీ 2015లో విక్రమ్‌తో మళ్లీ ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అయితే కొన్ని సమస్యలు అలాగే కొవిడ్ కారణంగా ఆ రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇక 2023 ఫిబ్రవరిలో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కానీ ఇంకా ఈ సినిమా రిలీజ్​కు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.

పాకీజా
ఈ బాలీవుడ్ క్లాసిక్ మూవీ పూర్తి కావడానికి సుమారు 16 సంవత్సరాలు పట్టిందట. కమల్ అమ్రోహి డైరెక్ట్​ చేసిన ఈ మూవీ షూటింగ్‌ 1956లో ప్రారంభమైంది. ప్రధాన నటి మీనా కుమారితో దర్శకుడి వ్యక్తిగత సమస్యలు, అలాగే ఇతర సవాళ్లతో సినిమా చాలా సార్లు నిలిచిపోయింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి కలర్‌కి మారడం వంటి సాంకేతిక సమస్యలు కూడా దీనికి తోడయ్యాయి. కీలకమైన సిబ్బంది మరణాలు సినిమాని మరింత ఆలస్యం చేశాయి. ఎట్టకేలకు పాకీజా 1971లో విడుదలై భారత సినీ రంగంలో ఐకానిక్ మాస్టర్ పీస్‌గా మారింది.

ది గోట్ లైఫ్
బెన్యామిన్ రచించిన ప్రముఖ మలయాళ నవల 'ఆడు జీవితం' ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీ పూర్తి కావడానికి ఏకంగా 16 సంవత్సరాలు పట్టింది. 2008లో దర్శకుడు బ్లెస్సీ ఈ నవలని సినిమాగా మార్చాలని నిర్ణయించుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ప్రాజెక్ట్ ప్రారంభమైంది. తర్వాత దీనికి తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. చాలా సంవత్సరాలు సినిమా ఆగిపోయింది. 2015లో కొత్త నిర్మాతలు ముందుకు వచ్చారు. 2018లో షూటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత కోవిడ్‌ వల్ల మళ్లీ ఆగిపోయింది. చివరగా 2022లో షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్‌ని పూర్తి చేసిన తర్వాత 2024 మార్చి 28న రిలీజ్‌ చేశారు.

21 ఏళ్లకే 75 మూవీలకు సైన్‌ - 100 ఆటోలు, 100 లారీలు కొనాలనే ప్లాన్‌! - ఈ బీటౌన్​ స్టార్ సక్సెస్ జర్నీ ఇదే!

యాక్టర్లే ప్రొడ్యూసర్లు! - 7 థియేటర్లలో రిలీజ్‌! కట్‌ చేస్తే నేటికీ ఈ సినిమా సూపర్‌ హిట్టే!

ABOUT THE AUTHOR

...view details