తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ ఫోటో నిజం కాదు - విజయ్ దేవరకొండ - Family Star Negative Trolling - FAMILY STAR NEGATIVE TROLLING

Family Star Vijay Devarkonda : ఫ్యామిలీ స్టార్ సినిమా మీద దుష్ప్రచారం జరుగుతుంది అంటూ ఆ చిత్ర బృందం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ విషయం మీద తాజాగా మరొక వార్త ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ.

Family Star Vijay Devarkonda
Family Star Vijay Devarkonda

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 1:15 PM IST

Updated : Apr 11, 2024, 1:33 PM IST

Family Star Vijay Devarkonda :ఫ్యామిలీ స్టార్ సినిమా గత వారం విడుదలైంది. ఆ సినిమా మీద కొన్ని సోషల్ మీడియా సైట్లు విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ విజయ్ దేవరకొండ టీమ్ మాదాపూర్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్​ను ఆ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పోలీసులకు సమర్పించింది. ఇలాంటివి చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. అయితే ఈ నేపథ్యంలో విజయ్ కూడా స్వయంగా వెళ్లి కంప్లైంట్ ఇచ్చారంటూ ఒక ఫోటో వైరల్ అయింది. అయితే అది నిజం కాదని విజయ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. టీమ్ మాత్రమే వెళ్లి కంప్లైంట్ ఇచ్చారని తను వెళ్లలేదని స్పష్టత ఇచ్చారు. ఫొటో ఇప్పటిది కాదని పాతదని చెప్పారు.

అంతకుముందు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా ఈ ట్రోల్స్​ విషయమై స్పందించారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నా కొన్ని సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తమ సినిమాపై ట్రోల్స్ వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఏప్రిల్ 5న విడుదలైన ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్​కు జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిందీ సినిమా. మొదటి రోజు కలెక్షన్ దాదాపు రూ. 6 కోట్లు వచ్చాయి. ఐదు రోజుల్లో దాదాపు రూ. 16 కోట్ల వరకు అందుకుంది. రంజాన్​తో పాటు వేసవి సెలవులు కూడా కలిసి రావడం వల్ల రెండో వారంతానికి ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్​లో సగం అయినా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ఓటిటి రైట్స్​ను నెట్ ఫ్లిక్స్(Family Star OTT) దక్కించుకుందట. మరో రెండు వారాల తర్వాత ఓటిటిలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి థియేటర్లలో అంతగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలోనైనా మంచి రెస్పాన్స్​ను అందుకుంటుందో లేదో.

Last Updated : Apr 11, 2024, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details