Family Star South America Release :రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. 'గీత గోవిందం' ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే తాజాగా ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ఓ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది.
ఓవర్సీస్లో ఇప్పటికే రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ సౌత్ అమెరికాలోని ఉరుగ్వేలో విడుదల కానున్న మొదటి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. ఈ విషయాన్ని మేకర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.
సెన్సార్ పూర్తి - ఆ అభ్యంతకర పదాలు కట్
మరోవైపు ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాను వీక్షించిన బోర్డు అందులోని ఐదు అభ్యంతరకర పదాలను తొలగించమని సూచించింది. ఆ డైలాగ్స్ వచ్చినప్పుడు వాటిని మ్యూట్ చేయమంటూ చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు 163 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. అంతే కాకుండా మూవీ టీమ్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఈ చిత్రం గురించి చెప్పిన పలు ఆసక్తికర అంశాలు కూడా ప్రేక్షకులకు ఈ మూవీపై మరింత ఆసక్తి కలిగిస్తోంది.