Eagle Movie Day 1 collection:మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజై సూపర్ హిట్ టాక్ అందుకుంది. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో హీరో రవితేజను కార్తిక్ ఫుల్ ఆఫ్ యాక్షన్ మోడ్‌లో చూపించారు. ఇక నాన్ హాలీడేలో రిలీజైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. రవితేజ గత రెండు సినిమాలతో పోలిస్తే ఈగల్ మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా తొలి ఎంత కలెక్షన్ చేసిందంటే?
ఇక శుక్రవారం ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫస్ట్, సెకండ్ షో ఆక్యుపెన్సీ పెరిగింది. కాకినాడలో అత్యధికంగా 64.50 శాతం, గుంటూరు లో 58.50 శాతం, విశాఖపట్టణంలో 50.75 శాతం, హైదరాబాద్‌లో 46.25 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక తొలిరోజు ఈగల్ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.6.2 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రెండో రోజుకు దాదాపు లక్ష టికెట్లు సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఈ వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజ్ సందడి కన్ఫార్మ్ అంటున్నారు.
'రావణాసుర', 'టైగల్ నాగేశ్వరరావు' సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. దీంతో రవితేజ ఈగల్‌పై చాలా ఫోకస్ చేసి హిట్ అందుకున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డైరెక్టర్ కార్తిక్ హీరో రవితేజను మునుపెన్నడూ లేని విధంగా చూపించారని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగుందని, అందులో చివరి 40 నిమిషాలు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని సినిమా చూసిన నెటిజన్లు చెబుతున్నారు.