తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తెలుగులో దుల్కర్ మరో మూవీ- రైతు పాత్రలో అలా! - Dulquer Salmaan

Dulquer Salmaan: దుల్కర్‌ సల్మాన్‌ ఇటీవల ‘కల్కి’లో అతిథి పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించారు. ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమా వివరాలు వెల్లడయ్యాయి. ‘సావిత్రి’, ‘సేనాపతి’ చిత్రాలను తెరకెక్కించిన పవన్‌ సాధినేని దర్శకత్వంలో దుల్కర్‌ సినిమా చేయనున్నారు. ఆదివారం దుల్కర్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు.

Dulquer Salmaan
Dulquer Salmaan (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 4:57 PM IST

Dulqer Salmaan Birthday: మహానటి’తో తెలుగువారికి చేరువయ్యారు నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ఇటీవల ‘కల్కి’లో అతిథి పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించారు. ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమా వివరాలు వెల్లడయ్యాయి. ‘సావిత్రి’, ‘సేనాపతి’ చిత్రాలను తెరకెక్కించిన పవన్‌ సాధినేని దర్శకత్వంలో దుల్కర్‌ సినిమా చేయనున్నారు. గీతాఆర్ట్స్‌, స్వప్నా సినిమాస్‌, లైట్‌బాక్స్‌ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఆదివారం దుల్కర్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. పోస్టర్‌ని బట్టి మనసుని హత్తుకునే కథతో ఇది సిద్ధమవుతుందని తెలుస్తోంది. దీనిని చూసిన పలువురు సినీ ప్రియులు ఆయనకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

ఇక దుల్కర్‌ అప్​కమింగ్ మూవీస్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన 'లక్కీ భాస్కర్‌' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. 'సార్​' ఫేమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫీమేల్​ లీడ్​గా కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫర్‌ సినిమాస్‌ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ జీవీ ప్రకాశ్‌ ఈ సినిమాకు చక్కటి స్వరాలు అందిస్తున్నారు. ఇటీవలే వచ్చిన 'శ్రీమతి గారు' సాంగ్ మ్యూజిక్ లవర్స్​ను తెగ ఆకట్టుకుంది. బ్లాక్ మనీ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ సెప్టెంబర్‌లో ప్రేక్షకుల వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details