తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నేనెప్పుడు అది చేయడానికే ప్రయత్నిస్తా' - హీరోయిన్స్ సర్జరీపై కృతి సనన్ - KRITI SANON ON COSMETIC SURGERY

హీరోయిన్స్ సర్జరీలు చేయించుకోవడంపై మాట్లాడిన దో పత్తి భామ కృతినసన్​!

Do Patti Kriti Sanon On Surgery
Do Patti Kriti Sanon On Surgery (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 9:25 AM IST

Do Patti Kriti Sanon On Surgery :ఓవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగానూ కెరీర్​లో ముందుకెళ్తోంది హీరోయిన్ కృతి సనన్‌. తాజాగా దో పత్తి అనే సినిమాను నిర్మించి నిర్మాతగా తొలి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్​ కాస్మోటిక్​ సర్జరీలు చేయించుకోవడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

"మహిళలు ఎప్పుడూ అందంగా ఉండాలి, గ్లామర్​గా కనిపించాలని వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. అందంగా కనిపించడం కోసం బాడీ పార్ట్స్​కు సర్జరీలు చేయించుకునే వారి గురించి నేను తీర్పు ఇవ్వలేను. అది పూర్తిగా వారి సొంత నిర్ణయం. శరీరంలోని ఒక భాగంలో మార్పు వచ్చినంత మాత్రాన అందంగా కనిపిస్తామన్న నమ్మకం ఉంటే మీరు ఏదైనా చేయించుకోవచ్చు. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే సమస్యలను కూడా మీరే ఎదుర్కోవాలి. మీ జీవితం, మీ ముఖం మీ ఇష్టం. నేను ఇలాంటి విషయాల్లో సలహాలు ఇవ్వను. నేనెప్పుడు అందం విషయంలోనూ ఒత్తిడికి గురి కాలేదు. ఎందుకంటే మానసికంగా ఆనందంగా ఉంటే అది ఎలాగో మన ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. నేనెప్పుడు అదే చేస్తాను. నేను తీసుకునే ఫొటోలకు కూడా ఫిల్టర్లు వాడను" అని చెప్పింది.

Kriti Sanon Do Patti Review :కాగా, కృతి సనన్‌ ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన దో పత్తి సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిందీ చిత్రం. ఈ ప్రాజెక్ట్​లో కృతి సనన్ ద్విపాత్రాభినయంలో నటించింది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కవలలైన అక్కా చెల్లెళ్ల గురించిన రహస్యాలను వెలికి తీసే పోలీసు అధికారి పాత్రలో సీనియర్ హీరోయిన్ కాజోల్‌ నటించింది. బ్లూ బటర్‌ ఫ్లై ఫిల్మ్స్‌ బ్యానర్​పై కృతి నిర్మించిన తొలి చిత్రం ఇదే. షహీర్‌షేక్, తన్వీ అజ్మీ, బ్రిజేంద్ర కాలా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

టీ20 స్టైల్​లో అందాల భామల దూకుడు - బాక్సాఫీస్ ముందు ఒకేసారి 2,3 చిత్రాలతో

'అందరూ ప్రభాస్​నే పెళ్లి చేసుకోవాలనుకుంటారు'- డార్లింగ్ క్రేజ్​​పై తమన్నా కామెంట్స్!

ABOUT THE AUTHOR

...view details