DJ Tillu Heroine Anupama Parameshwaran Bold Role :అనుపమ పరమేశ్వరన్ ఫ్యామిలీ బ్యూటీ. హోమ్లీగా కనిపిస్తుంది. రింగురింగుల జట్టు, కట్టుబొట్టుతో సంప్రదాయంగా ఉంటుందంటారు సినీ అభిమానులు. ఇది ఇప్పటివరకు ఉన్న టాక్ మాత్రమే. టిల్లు స్క్వేర్ ట్రైలర్‌తో ఆ ఫీలింగ్ పూర్తిగా మారిపోయింది. బోల్డ్ బ్యూటీగా యాక్టింగ్‌తో ఇరగదీసింది అనుపమ. లిప్ లాక్ కిస్సులతో రెచ్చిపోయ్యారు. టిల్లుగాడి అల్లరికి అనుపమ అందం తోడై బోల్డ్ సీన్స్ కిర్రాక్ ఉన్నాయని అంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో టిల్లు స్వ్కేర్ మూవీలో మూడో సాంగ్ రిలీజ్ కోసం తాజాగా ఓ ఈవెంట్ జరిగింది. ఓ మై లిల్లీ పాటను విడుదల చేసింది మూవీ టీమ్. బ్రేకప్ సాంగ్‌గా ఎమోషనల్‌గా సాగిందీ పాట. ఈ పాట విడుదల ఈవెంట్‌కు హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ కూడా హాజరయ్యారు.అనంతరం మీడియాతో ముచ్చటించారు. అయితే ఈ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేయడం గురించి అనుపమను వరుస ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో అనుపమా స్ట్రాంగ్‌గా ఆన్సర్ ఇచ్చారు.
బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అలానీ మీరు ప్రతిరోజూ బిర్యానీనే తింటారా? తినలేరు కదా? అంటూ రిపోర్టర్ ను అనుపమ తిరిగి ప్రశ్నించారు. తాను కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తానంటూ నొప్పించకుంటా చెప్పేసారు. డైరెక్టర్ ఇచ్చిన పాత్రకు నూటికి నూరుశాతం తన డ్యూటీ చేయడమే అంటూ గట్టిగానే సమాధానం చెప్పారు.
అనుపమ మాట్లాడుతూ "నేను ప్రతిరోజూ బిర్యానీ తినాలనుకోవడం లేదు. నాకు విభిన్న రుచులు కావాలి. పులావ్ కావాలి. పులిహోర కావాలి. డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్‌ను వందశాతం చేయడం నా డ్యూటీ. అది చేయడానికి నేను ప్రయత్నం చేశాను" అంటూ బదులిచ్చారు.