Disha Patani Latest Tattoo :బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ దిశా పటానీ కల్కి సినిమాతో తెలుగువారికి మరోసారి దగ్గరైంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కనిపించిన ఈ చిన్నది, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈమె చేతిపై ఉన్న ఓ టాటూ వల్ల ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఆమె చేతిపై "PD" అనే టాటూతో కనిపించింది. తాజాగా కనిపించిన ఈ టాటూ చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ప్రభాస్, దిశా రిలేషన్లో ఉన్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
దిశా శరీరంపై మిస్టరీ టాటూ - ఆ హీరో పేరు వచ్చేలా? మీనింగ్ అదేనా! - Disha Patani Latest Tattoo - DISHA PATANI LATEST TATTOO
Disha Patani Latest Tattoo : 'కల్కి 2898 AD'లో కీలక పాత్ర పోషించిన యంగ్ బ్యూటీ దిశా పటానీ గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఆమె శరీరంపై ఉన్న ఓ టాటూ. ఇంతకీ ఆ టాటూలో ఏముందంటే?
Disha Patani (Getty Images)
Published : Jul 2, 2024, 1:38 PM IST
"PD" అనే లెటర్స్ ప్రభాస్ డార్లింగ్ అంటూ డీకోడింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ కూడా చేసి ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇది దిశా పటాని పేరులోని అక్షరాల రివర్స్ కూడా కావచ్చని కొందరి మాట. ఏదీ ఏమైనప్పటికీ ఈ విషయంపై దిశా క్లారిటీ ఇస్తే కానీ ఈ రూమర్స్‌కు చెక్ పడదని ఫ్యాన్స్ అభిప్రాయం.