తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫుట్​పాత్​ లైఫ్ నుంచి స్టార్ డైరెక్టర్​గా - తేజ​ పరిచయం చేసిన అందాల భామలు వీరే!

Director Teja Birthday Special : ఒకప్పటి 'చిత్రం' సినిమా నుంచి ఇప్పటి 'అహింస' వరకు ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త టాలెంట్​లను అందించారు డైరెక్టర్ తేజ. ఈ సినిమాల ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇంతకీ వారెవరంటే ?

Director Teja Birthday Special
Director Teja Birthday Special

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 9:29 AM IST

Director Teja Birthday Special :టాలీవుడ్​లో సెన్సేషనల్ డైరెక్టర్ అనగానే గుర్తొచ్చే పేరు తేజ. 'చిత్రం' సినిమా ద్వారా డైరెక్టర్​గా తన జర్నీ స్టార్ట్​ చేసిన ఆయన ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనదైన బాటలోనే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ కొత్త టాలెంట్ను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన స్కూల్​ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. ప్రస్తుతం వారిలో కొంతమంది స్టార్ స్టేటస్​ను అనుభవిస్తున్నారు. వారెవరంటే :

  • తొలి సినిమా 'చిత్రం'తో టాలీవుడ్ పరిశ్రమకు రీమాసేన్ రూపంలో సరికొత్త అందాన్ని పరిచయం చేశారు డైరెక్టర్ తేజ. ఇందులో ఈ ముద్దుగుమ్మ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆక్టటుకుంది. ఆ తర్వాత ఈమె తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి ఆడియెన్స్​ను మెప్పించింది.
  • ఆ తర్వాత 2001లో విడుదలైన 'నువ్వు నేను' సినిమాతో అనిత అనే మరో బ్యూటీని పరిచయం చేశారు. ఈ సినిమాతోనే హీరో ఉదయ్​కిరణ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరితో ఓ సూపర్ హిట్ కొట్టారు డైరెక్టర్ తేజ. ఈ సినిమ ఈ ముగ్గురి కెరీర్​ను మలుపు తిప్పింది.
  • ఇక 2002లో వచ్చిన జయం సినిమాతో సదా ఇండస్ట్రోలోకి ఎంట్రీ ఇచ్చారు. తేజ స్కూల్​ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్​డమ్​ను సంపాదించింది.
  • మన చందమామ కాజల్​ను కూడా తేజానే ఇండస్ట్రీకి పరిచయం చేశారు 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో ఈమె టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది.
  • ఇక 'నీకు నాకు' అనే సినిమా ద్వారా నందితా శ్వేత ఆ తర్వాత వచ్చిన 'ధైర్యం' సినిమా ద్వారా రైమా సేన్​ను టాలివుడ్​కు పరిచయం చేశారు. ఇలా ఇండస్ట్రీకి దాదాపు వెయ్యి మందికి పైగా టెక్నిషియన్లను, వారిలో కొంతమంది నటులను పరిచయం చేసినట్లు అప్పట్లో తేజ స్వయంగా వెల్లడించారు.

ఫుట్ పాత్​పై జీవనం
Director Teja Biography :ఇక తేజ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చిన్నతనం నుంచే తేజ కష్టాల కడలిని ఈదుకుంటూ జీవితం సాగించారంటూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనలయ్యారు. చిన్నప్పుడే తల్లిదండ్రుల మరణం వల్ల తమ బంధువులు వాళ్లను ఆస్తి కోసం చేరదీశారని అయితే ఒకానొక సమయంలో ఆయన్ను వాళ్లే బయట పడుకోమన్నారంటూ చెప్పుకొచ్చారు. అవన్ని తట్టుకుని ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చేశారని అప్పుడు ఉండేందుకు చోటు లేక ఫుట్‌పాత్ మీద ఆకలితో పడుకున్నారంటూ బాధపడ్డారు. అయితే అక్కడ నుంచి ఇప్పుటి వరకు ఎన్నో విజయాలు సాధించారంటే దానికి కారణం సినిమానే అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే రీసెంట్​గా అహింస చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన త్వరలోనే విలక్షన నటుడు రానాతో ఓ సినిమా చేయబోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details