Director Sukumar Family Photos :క్రియేటివ్డైరెక్టర్ సుకుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు ఫేవరెట్ డైరెక్టర్! తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన 'పుష్ప' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఆయన తెరకెక్కించిన 'పుష్ప' చిత్రం ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన 'పుష్ప 2'(Pushpa 2 Movie Shooting) చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో సుకుమార్ ఫ్యామిలీ ఫోటోస్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. సుక్కు కూతురు సుకృతివేణి బర్త్ డే సెలబ్రెషన్స్ గ్రాండ్‌గా జరిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలను సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సుకుమార్‌కు ఓ బాబు సుక్రాంత్ కూడా ఉన్నాడు. ఈ పిక్స్‌ను చూసిన ప్రేక్షకులు, సుక్కు అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. సుకృతివేణి అచ్చం తండ్రిలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోస్ను తెగ షేర్ చేస్తున్నారు. పిక్స్‌లో సుకృతి బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ వేసుకొని ఎంతో అందంగా కనిపించింది! అయితే ఇప్పటికే కొంతమందికి సుకృతివేణి తెలుసు. ఎందుకంటే ఈమె 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన తండ్రి గురించి ఎమోషనల్‌గా మాట్లాడి హైలైట్ కూడా అయింది. సుకృతికి ఇన్‌స్టాగ్రామ్‌లో 13.1K ఫాలోవర్స్ కూడా ఉన్నారు.