ETV Bharat / state

కొత్త రేషన్​ కార్డ్​కు అప్లై చేశారా? - జస్ట్​ సింగిల్​ క్లిక్​తో మీ స్టేటస్​ చెక్​ చేసుకోండి - అదీ ఫోన్​లోనే! - RATION CARD APPLICATION STATUS

కొత్త రేషన్​ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తు చేశారా? ఇలా ఫోన్​లోనే క్షణాల్లో స్టేటస్​ తెలుసుకోండి!

How to Check Ration Card Application Status
How to Check Ration Card Application Status (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 11:50 AM IST

How to Check Ration Card Application Status: కొత్త రేషన్​ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడంతో తెలంగాణలో ప్రస్తుతం రేషన్ కార్డుల జాతర నడుస్తోంది. ఎక్కడ చూసినా మీ-సేవా కేంద్రాల వద్ద రద్దీ విపరీతంగా ఉంది. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత కొత్త రేషన్​ కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు యాడ్​ చేయడం వంటి సేవలు లభిస్తుండడంతో చాలా మంది మీ సేవకు క్యూ కడుతున్నారు. ఇంతవరకూ బానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే వచ్చింది. కొత్త రేషన్​ కార్డుల కోసం అందరూ దరఖాస్తు చేసుకుంటున్నారు కానీ, దాని స్టేటస్ ఏంటి? ఎలా తెలుసుకోవాలి? అనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వారు జస్ట్​ ఒక్క క్లిక్​తో కేవలం ఇంట్లో నుంచే మీ రేషన్​ కార్డ్​ అప్లికేషన్​ స్టేటస్​ తెలుసుకోవచ్చు. అందుకోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రేవంత్ రెడ్డి సర్కార్ జనవరి 26న ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. ఈ జాబితాల్లో అర్హుల పేర్లు లేకపోవడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రేషన్​ కార్డుల దరఖాస్తులపై క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, ఇందుకోసం మీ-సేవా కేంద్రాల్లో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని చెప్పింది. దీంతో కొత్త కార్డుల కోసం ప్రజలంతా మీ-సేవా కేంద్రాలకు క్యూ కట్టారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే దరఖాస్తు చేసుకుంటున్న వరకు బానే ఉన్నా, ఆ దరఖాస్తు పరిస్థితి ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది? రేషన్ కార్డు మంజూరు అయ్యిందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఈ క్రమంలోనే కేవలం క్షణాల్లోనే మన అప్లికేషన్​ స్టేటస్​ ఏంటనేది తెలుసుకోవచ్చు. అందుకోసం,

  • ముందుగా తెలంగాణ ఫుడ్​ సెక్యూరిటీ కార్డ్స్​ అధికారిక వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి. https://epds.telangana.gov.in/FoodSecurityAct/
  • హోమ్​ పేజీలో ఎడమవైపు కనిపించే ఆప్షన్లలో FSC Search పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు Ration Card Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే FSC Search, FSC Application Search, Status of Rejected Ration Card Search ఆఫ్షన్లు కనిపిస్తాయి. అందులో FSC Application Search మీద క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ-సేవా అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది.
  • అందులో ముందుగా జిల్లా సెలెక్ట్ చేసుకుని, అప్లికేషన్ నెంబర్ బాక్సులో దరఖాస్తు సమయంలో మీ సేవ రసీదు నెంబర్​ను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే మన అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలు కింద కనిపిస్తాయి.
  • ఒకవేళ ఎవరిదైన రేషన్ కార్డు రిజెక్ట్ అయితే దాని స్టేటస్ తెలుసుకునేందుకు Status of Rejected Ration Card మీద క్లిక్ చేసి రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు అందుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.

ఇక్కడ అన్ని ఫిర్యాదులు స్వీకరించబడును! : ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక వెబ్‌సైట్‌

ఒక్క క్లిక్​తో "ఇందిరమ్మ ఇళ్ల" స్టేటస్ - ఫోన్​లోనే ఇలా చెక్​ చేసుకోండి!

వాట్సాప్​లో LIC సేవలు - మీ పాలసీ ఆగిపోయినా, ఆన్​లో ఉన్నా ఒక్క క్లిక్​తో సమస్త సమాచారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.