Director ss rajamouli son ss karthikeya Earthquake : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో సినిమాకు తన ఇమేజ్ను పెంచుకుంటూ పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగారు. బాహుబాలికి ముందు టాలీవుడ్‌కే పరిమితమైన జక్కన్న ఆ మూవీ రెండు పార్ట్లు బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఆయనకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా రాజమౌళి ఎదిగారు. ఇప్పటికీ అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ మేనియా తగ్గడం లేదంటే ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తీకేయ పెట్టిన తాజా పోస్టు ఫ్యాన్స్‌ను కాస్త షాక్‌కు గురిచేసింది. జపాన్‌లో ఓ భూకంపం నుంచి తాను సేఫ్‌గా బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. మొదటిసారి భూకంపం ఎక్స్‌పీరియన్స్‌ను చేశామని తెలిపాడు. "జపాన్‌లో ఇప్పుడే భూకంపం ఎలా ఉంటుందో చూశాం. మేం 28వ అంతస్తులో ఉండగా బిల్డింగ్ మెల్లిగా కదలింది. ఆ తర్వాత ఇది భూకంపం అని అర్ధం అయింది. నేను చాలా భయపడ్డాను. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఏదో వర్షం పడటం మొదలవుతోంది అన్నట్టుగా క్యాజువల్‌గా ఉన్నారు. మొత్తానికి భూకంపాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేశాం" అంటూ రాసుకొచ్చాడు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్ ఫొటో తీసి కార్తీకేయ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు రాజమౌళి ఆయన కుటుంబం సేఫ్‌గా ఇండియాకు తిరిగి రావాలని కార్తీకేయ పోస్టులో కామెంట్స్ చేస్తున్నారు.