Rashmi Rajamouli :దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో వరల్డ్‌వైడ్‌గా క్రేజ్ సంపాదించారు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో అప్పుడప్పుడు స్క్రీన్‌పై కూడా మెరుస్తుంటారు. గెస్ట్ రోల్స్‌లో కనిపించి ఆయనలోని నటన స్కిల్స్ చూపిస్తుంటారు. అయితే ఆయన జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌తో కలిసి నటించారని మీకు తెలుసా? అంతేకాదు వాళ్లిద్దరి మధ్య లవ్‌ట్రాక్ సీన్స్ ఉన్నాయి. ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడు నటించారని? ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే?
రాజమౌళి, రష్మీ లవ్ ట్రాక్- జబర్తస్ద్ బ్యూటీతో జక్కన్న రొమాన్స్!- వీడియో వైరల్ - RASHMI RAJAMOULI
రష్మీతో రాజమౌళి లవ్ ట్రాక్- ఈ ఇద్దరి వీడియో చూశారా?

Published : Feb 19, 2025, 10:19 AM IST
విక్రమార్కుడు సినిమా సమయంలో 'యువ' అనే తెలుగు సీరియల్ వచ్చేది. ఆ సీరియల్లో రష్మీ రేడియో జాకీ పాత్రలో నటించారు. అయితే విక్రమార్కుడు ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి సీరియల్లో గెస్ట్ రోల్లో మెరిశారు. ఈ క్రమంలోనే ఆయన రష్మీతో కలిసి నటించారు. ఈ సీన్లో రష్మీని ప్రేమించే వ్యక్తిగా కనిపించారు. వీళ్లిద్దరి మధ్య ఓ లవ్‌ట్రాక్ ఉంది. అయితే ఈ సీన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రష్మీతో జక్కన్న 'లవ్ స్టోరీ', 'రాజమౌళి- రష్మీ ఎప్పుడు నటించారు?', 'ఈ లవ్ ట్రాక్ భలే ఫన్నీగా ఉంది' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి మీరూ ఈ వీడియో చూసేయండి.