తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నీల్ మైక్ పడితే చరిత్రే- నీకోసం వెయిటింగ్ తారక్ అన్న' - NTR NEEL SHOOTING

ఎన్టీఆర్- ప్రశాంత్ షూటింగ్ ప్రారంభం- సినిమాపై డైరెక్టర్ భార్య ఇంట్రెస్టింగ్ పోస్ట్

NTR Neel Shooting
NTR Neel Shooting (Source : NTR Arts 'X' Post)

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2025, 8:39 AM IST

NTR Neel Shooting :పాన్ఇండియా స్టార్ ఎన్టీఆర్- ప్రశాంత్ కాంబోలో రూపొందుతున్న 'NTRNeel' సినిమా షూటింగ్ ఎట్టకేలకు గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. షూటింగ్​ స్పాట్​లోని ఓ ఫొటోను మూవీటీమ్ షేర్ చేసింది. తొలి షెడ్యూల్​లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్​ చిత్రీకరిస్తున్నట్లు ఫొటో చూస్తే తెలుస్తోంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్​కు ఈ ఫొటో ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నీల్​ సతీమణి లిఖితారెడ్డి షూటింగ్​ను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్​తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి ఆ పోస్ట్ ఏంటంటే?

'ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. అతడు (ప్రశాంత్) మైక్ పట్టాడంటే, చరిత్ర తిరగరాస్తాడు. విధ్వంసం ఇప్పుడే ప్రారంభమైంది. ఎన్టీఆర్ అన్న సెట్స్​పైకి వచ్చేవరకు వెయిట్ చేయలేకపోతున్నా' అని లిఖిత పోస్ట్ చేశారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్​తో పాటు ఈ సినిమా కోసం ప్రశాంత్ వైఫ్ లిఖత కూడా ఎంత ఆత్రుతగా ఉన్నారో ఈ ఒక్క పోస్ట్​తో తెలుస్తోంది.

మాస్​ హీరో ఎన్టీఆర్​కు తగ్గట్లుగానే ప్రశాంత్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్​గా రానుంది. తారక్‌ మునుపెన్నడూ చేయని మాస్‌ పాత్రలో, విభిన్నమైన లుక్‌తో కనిపించనున్నారు. గురువారం ప్రారంభమైన తొలి షెడ్యూల్‌లోనే దాదాపు 3వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారంట. ఇక ప్రస్తుతం 'వార్ 2' సినిమాతో బిజీగా ఉన్న తారక్, త్వరలోనే ఈ ప్రాజెక్ట్​ షూటింగ్ సెట్​లో జాయిన్ అవ్వనున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రశాంత్ భార్య లిఖిత కూడా భాగం కానున్నట్లు సమాచారం. డైరెక్షన్ డిపార్ట్​మెంట్​లో లిఖిత పనిచేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌ కనిపించనుంది. రవి బస్రూర్‌ సంగీత దర్శకుడిగా, భువన్‌ గౌడ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రిమూవీ మేకర్​ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా 2026 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

NTR​పై డబుల్ ప్రెజర్! సినిమాల షూటింగ్ ఆలస్యం!- ఆ మూవీస్​ టైమ్​కు వచ్చేనా?

అప్పుడు కన్నడ! ఇప్పుడు మలయాళం - 'NTR 31'లో మరో పాన్​ ఇండియా స్టార్​!

ABOUT THE AUTHOR

...view details