Kalki 50 Days Nag Ashwin:రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి ఏడీ 2898' గురువారానికి దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఆడియెన్స్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ రీసెంట్గా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే 50 డేస్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్‌గా జరిగాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ సంధ్య థియేటర్ (Sandhya RTC X Road)లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యామిలీతోపాటు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఆయన అభిమానుల మధ్య సినిమా చూశారు. ఫ్యాన్స్‌తోపాటు నాగ్ అశ్విన్ కేరింతలు కొడుతూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇక థియేటర్ యాజమాన్యం ఆయనను శాలువాతో సత్కరించింది. అనంతరం అశ్విన్ భారీ కేక్ కట్ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోలను ఫుల్ షేర్ చేస్తున్నారు.
కాగా, జూన్ 27న గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.1100కోట్లకుపైగా వసూల్ చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రభాస్‌తోపాటు సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ కూడా ఉండనుంది.