Devara 2 Cast Update:గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ 'దేవర' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్ వైపునకు దూసుకెళ్తోంది. అయితే 'దేవర'కు సీక్వెల్ ఉందని డైరెక్టర్ కొరటాల శివ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందులో నటించే నటుల గురించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'రణ్వీర్ లేదా రణ్‌బీర్'
'దేవర పార్ట్-2' లో ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటుడిని చూడాలనుకుంటున్నారా? అని దర్శకుడు కొరటాల శివకు ప్రశ్నించగా, ఆయన సమాధానం ఇచ్చారు. 'నేను కచ్చితంగా చెప్పలేను. నిజానికి నా కోరికల జాబితాలో చాలా మందే ఉన్నారు. కానీ, నిజం చెప్పాలంటే రణ్వీర్ సింగ్ లేదా రణ్‌బీర్ కపూర్‌ను 'దేవర' ప్రపంచంలో చూడాలనుకుంటున్నాను. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఇది స్పాయిలర్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ దీనిపై ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను' అని కొరటాల శివ వ్యాఖ్యానించారు.
శివ కామెంట్స్ వైరల్
ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇవి విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'దేవర- 2' నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, 'దేవర' సీక్వెల్ ఊహించని విధంగా అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు రణ్వీర్ లేదా రణ్‌బీర్ ఎవరో ఒకరు 'దేవర-2'లో భాగమవుతారని అభిమానులు ఆశిస్తున్నారు.