Director Harish Shankar:టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ బ్లాక్‌బస్టర్ సినిమాలు తెరకెక్కించడమే కాకుండా రీయల్ లైఫ్‌లో సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తుంటారు. అప్పుడప్పుడు ఇతరులకు సాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఆయన చేసిన పనికి సోషల్ మీడియాలో హరీశ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ హరీశ్ చేసిన పని ఏంటి? ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపించడానికి కారణం ఏంటో తెలుసా?
అయితే రోడ్డుపై నిలిచిపోయిన ఓ వాహనాని (కారు)కి డైరెక్టర్ హరీశ్ సాయం చేశారు. ఎదో కారణం చేత ఆగిపోయిన కారును నిర్మాత రవిశంకర్‌తో కలిసి ఆయన కొద్ది దూరం నెట్టారు. ఆయనతోపాటు మరికొందరు కూడా హెల్ప్ చేశారు. దీన్నీ ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హరీశ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ రేంజ్లో ఉన్నప్పటికీ నడి రోడ్డుపై ఆగిపోయిన కారును నెట్టడం ఆయన 'సింప్లిసిటికి నిదర్శనం' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరలైంది.
ఇక హరీశ్ శంకర్ సినిమాల విషయానికొస్తే, ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్', మాస్ మహరాజ రవితేజతో 'మిస్టర్ బచ్చన్' ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఉస్తాద్ కాస్త బ్రేక్ తీసుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు రీస్టార్ట్ కానున్నాయి. ఇక మిస్టర్ బచ్చన్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.