తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కలెక్షన్లు థియేటర్​లో, కామెంట్లు ట్విట్టర్​లో ఉంటాయి- గుర్తుపెట్టుకోండి' - Mr Bachchan Harish Shankar - MR BACHCHAN HARISH SHANKAR

Mr Bachchan Harish Shankar: 'మిస్టర్ బచ్చన్‌' సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న టాక్ గురించి డైరెక్టర్ హారీశ్ శంకర్ స్పందించారు. తాజాగా ఆయన నిర్వహించిన మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

Mr Bachchan Harish Shankar
Mr Bachchan Harish Shankar (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 3:29 PM IST

Mr Bachchan Harish Shankar:మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్‌' సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాకు వస్తున్న టాక్ గురించి డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందించారు. తాజాగా ఆయన నిర్వహించిన మీడియా చిట్​ చాట్​లో మాట్లాడారు. సినిమాలో మంచిని పక్కనపెట్టేసి, ఒక్క పాయింట్‌ ఆధారంగా విమర్శించేవారిని పట్టించుకునే అవసరం లేదని హరీశ్ ఈ సందర్భంగా అన్నారు.

'రవితేజ గతంలో నటించిన పలు సినిమాలు కూడా కాస్త నిరాశపరిచాయి. కానీ, ఆ దర్శకుల మీద లేని అటాక్‌ నా ఒక్కడిపైనే ఉంది. ఎందుకంటే కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను పర్సనల్​గా టార్గెట్‌ చేసి నెగెటివ్‌ టాక్‌ ప్రచారం చేస్తున్నారు. ఇందులోని ఒక డ్యాన్స్‌ మూమెంట్‌ను తీసుకొని విమర్శిస్తున్నారు. కానీ, సినిమాలో మంచి డైలాగులు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడం లేదు. 'కట్నం తీసుకొని కాపురం చేసే మగవాడు వ్యభిచారం చేసినట్లు లెక్క' అని రాశాను. దాన్ని పక్కన పెట్టేశారు. ఆ డైలాగు అమ్మాయిలకు చాలా నచ్చిందని నాకు ఫోన్‌ చేసి చెప్పారు. అలాగే హీరో ఓ సందర్భంలో హీరోయిన్‌తో 'నీకు నా ప్రేమ అర్థమయ్యేవరకు నిన్ను కదిలించను' అంటాడు. అమ్మాయిలు ఏ విషయంలోనైనా 'నో' చెబితే వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ డైలాగు రాశాను. దీని గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. మంచిని పక్కనబెట్టి వాళ్లకు సౌకర్యంగా ఉన్న ఒక్క అంశాన్ని తీసుకుని విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని హారీశ్ అన్నారు.

సోషల్ మీడియా లైఫ్ కాదు
ఇదే సందర్భంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి కూడా మాట్లాడారు. 'సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ నాకు కొత్త కాదు. అలానే సోషల్‌ మీడియా మాత్రమే నా జీవితం కాదు. నా వ్యక్తిత్వం గబ్బర్‌సింగ్‌లో 'నేను ఆకాశం లాంటి వాడిని. ఉరుము వచ్చినా పిడుగు వచ్చినా ఇలానే ఉంటా' అనే డైలాగ్ వంటింది.

కలెక్షన్లు థియేటర్లో- కామెంట్లు ట్విట్టర్​లో
ఏవో తెలియని వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది తనను యాడ్ చేస్తున్నారని హరీశ్ అన్నారు. తనను ఎటువంటి గ్రూపుల్లో యాడ్ చేయవద్దని ఆయన కోరారు. 'ఎక్కడో టెక్నికల్ ఇష్యూ వల్ల వేరే గ్రూపుల్లో యాడ్ చేసి మీ పంచాయితీల్లోకి నన్ను లాగుతున్నారు. అలా చేయకండి. పర్సనల్​గా ఎవరైనా డైరెక్ట్ మెసేజ్ చేసినా, ట్విట్టర్​లో ట్యాగ్ చేసినా నేను రిప్లై ఇస్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి కలెక్షన్లు థియేటర్లో ఉంటాయి. కామెంట్లు ట్విట్టర్​లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి' అని అన్నారు.

'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్'- తొలి రోజు వసూళ్లు ఎంతంటే? - Mr Bachchan Double Ismart

మెట్రోలో 'మిస్టర్ బచ్చన్' ప్రమోషన్స్​- ప్యాసింజర్లకు​ సర్​ప్రైజ్​- ఎంతైనా రవితేజ స్టైలే వేరు - Mr Bachchan Promotions

ABOUT THE AUTHOR

...view details