తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఉస్తాద్' క్రేజీ అప్డేట్- మూవీలో రియల్ లైఫ్ సీన్- PK ఫ్యాన్స్​కు గూస్​బంప్సే! - USTAAD BHAGAT SINGH

'ఉస్తాద్ భగత్ సింగ్' క్రేజీ అప్డేట్- పవన్​ రియల్ లైఫ్ సీన్ రీ క్రియేట్

Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2025, 2:38 PM IST

Ustaad Bhagat Singh :పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న సినిమా 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం వల్ల 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అదివారం 'డ్రాగన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొన్న హరీశ్ 'ఉస్తాద్‌' గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పవర్ స్టార్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి రీల్​పై తెరకెక్కించే ప్లాన్​లో ఉన్నట్లు చెప్పారు.

డ్రాగన్ డైరెక్టర్ ​అశ్వత్‌ మారిముత్తు తాను పవన్ కల్యాణ్​ అభిమానిని అని చెప్పారు. పవన్​తో సినిమా తీసే ఛాన్స్​ వస్తే, ఆయనను పవర్​ఫుల్​ పాత్రలో చూపిస్తానని అన్నారు. ఆయన రియల్ లైఫ్​లో కారు రూఫ్​పై కూర్చొని ట్రావెల్ చేసిన సీన్​ రీ క్రియేట్ చేయాలని ఉందని అన్నారు. దీనికి హరీశ్ స్పందిస్తూ, 'నేను కూడా పవన్ సర్​కు పెద్ద అభిమానిని. ప్రస్తుతం ఆయనతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నా. మీరు ఇందాక చెప్పినట్లు ఆయన కారు టాప్​పై కూర్చొని వెళ్తున్న సీన్​ నేను ఆల్రెడీ రాసుకున్నా. ఇందులో ఆ రీయల్ లైఫ్ సీన్ ఉంటుంది' అని హరీశ్ చెప్పారు.

అయితే గతంలో పవన్ కల్యాణ్​ ఓ సందర్భంలో కారు రూఫ్​పై కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆయన అలా టాప్​పై కూర్చొని ఉండగా, కారుకు ఇరువైపులా సెక్యూరిటీ, వెనకాల బైకులపై అభిమానులు వెళ్లారు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ వైరలైంది. ఇలాంటి సీన్ పవన్​కు సినిమాల్లో పడాలని అప్పట్నుంచి అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా హరీశ్ అప్డేట్​తో పవన్ ఫ్యాన్స్​లో ఫుల్ జోష్ వచ్చింది. ఈ సీన్​కు థియేటర్లలో పూనకాలే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఈ సినిమాలో తమిళ్ తేరీ రీమేక్​గా తెరకెక్కుతోంది. ఇందులో యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

'ఉస్తాద్​ భగత్​సింగ్' ​ స్క్రిప్ట్​లో మార్పులు- పవన్ రిక్వెస్ట్​కు డైరెక్టర్ ఓకే!

Ustaad Bhagat Singh Villan : 'ఉస్తాద్'​ విలన్​గా కోలీవుడ్ పవర్​ఫుల్​ యాక్టర్​.. హరీశ్​ శంకర్​ భలే నటుడిని పట్టారుగా!

ABOUT THE AUTHOR

...view details