Devara Second Trailer :గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లీడ్ రోల్లో నటించిన 'దేవర పార్ట్ 1' మరో 6 రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. పలు భాషల్లో మూవీటీమ్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. హైదరాబాద్ నోవాటెల్‌లో గ్రాండ్‌గా జరగనుంది. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా తారక్ ఫ్యాన్స్‌కు మూవీటీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుంది.
సినిమా నుంచి రెండో ట్రైలర్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందే ఉదయం 11.07 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ వచ్చినట్లైంది. అయితే మొదటి ట్రైలర్ కంటే ఎక్కువగా వీఎఫ్ఎక్స్, ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్‌తో దీన్ని రెడీ చేశారని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి రెండో ట్రైలర్లో దేవర ఎలా ఉంటాడు? మరికొన్ని గంటల్లో తెలుస్తుంది!
ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హై లెవెల్ వీఎఫ్ఎక్స్, అండర్ వాటర్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ లుక్స్, యాక్షన్ సీన్స్ ట్రైలర్లో చూపించారు. 10రోజుల్లోనే ఈ ట్రైలర్‌కు తెలుగులో 43+ మిలియన్ల వ్యూస్ వచ్చాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు.