తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'దేవర ముంగిట నువ్వెంత' - ఎనర్జిటిక్​గా ఉన్న ఫస్ట్ సింగిల్ - Devara Fear Song - DEVARA FEAR SONG

Devara Fear Song : జూనియర్ ఎన్​టీఆర్​, కొరటాల శివ కాంబినేషన్​లో రూపొందుతున్న దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్​ను మేకర్స్ విడుదల చేశారు. ఫియర్​ సాంగ్ అనే టైటిల్​తో వచ్చిన ఈ సాంగ్​ మ్యూజిక్ లవర్స్​ను ఆకట్టుకుంటోంది. ఆ వీడియో మీ కోసం.

Devara Fear Song
Devara Fear Song (Source : ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 7:09 PM IST

Updated : May 19, 2024, 7:34 PM IST

Devara Fear Song :జూనియర్ ఎన్​టీఆర్​, కొరటాల శివ కాంబినేషన్​లో రూపొందుతున్న దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్​ను మేకర్స్ విడుదల చేశారు. 'ఫియర్​ సాంగ్' అనే టైటిల్​తో వచ్చిన ఈ పాట​ మ్యూజిక్ లవర్స్​ను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా ఐదు భాషల్లో ఈ సాంగ్ రిలీజైంది.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సాంగ్​కు ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించగా, తెలుగులో ఈ సాంగ్​కు ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి పవర్​ఫుల్ లిరిక్స్ అందింటారు. 'దేవర ముంగిట నువ్వెంత' అంటూ సాగే ఆ సాంగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతూ అభిమానులకూ గూస్​బంప్స్ తెప్పిస్తోంది. విజువల్స్​ కూడా వేరే లెవెల్​లో ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక దేవర సినిమా విషయానికి వస్తే, సీ కాన్సెప్ట్​ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కుతున్న 'దేవర' రెండు భాగాలుగా వస్తుందని చిత్ర బృందం ముందే ప్రకటించింది. కొరటాల శివ రూపొందిస్తున్నఈ చిత్రం మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఎన్​టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.120 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్​ను అక్కడి స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో పాటు AA ఫిల్మ్స్ సంస్థ కూడా ఈ రైట్స్​ను దక్కించుకుంది.

"ఈ సినిమా నార్త్ ఇండియా థియేటర్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పార్టనర్​షిప్ అనౌన్స్ చేస్తున్నందుకు, ఒక మంచి సినిమా అనుభవాన్ని అందరికి ఇవ్వగలుగుతున్నందుకు మాకు చాలా గర్వంగా, థ్రిల్​గా ఉంది" అంటూ కరణ్ జోహార్ తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
గోవాలో 'దేవర' బిజీబిజీ- ఎన్టీఆర్ న్యూ స్టిల్ వైరల్- ఫొటో చూశారా?. - NTR Devara New Look From Sets

వాట్​ ఏ ప్లానింగ్ 'దేవర' - ఆయన చేతికి నార్త్ థియేట్రికల్ రైట్స్​ - NTR Devara

Last Updated : May 19, 2024, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details