Devara Box Office Collections :జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు మరో ఘనతను సాధించింది. అదేంటంటే?
'దేవర' రిలీజై 18 రోజులు పూర్తవ్వగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో రోజూ కోటి రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కొవిడ్ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాగా 'దేవర' రికార్డుకెక్కడం గమనార్హం. అలాగే సీడెడ్లోనూ రూ.30 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు మాత్రమే అక్కడ ఈ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన తీసిన చిత్రం కాకుండా మరో దర్శకుడి సినిమా ఈ స్థాయిలో వసూలు సాధించడం తొలిసారి కావడం విశేషం. దీంతో సీడెడ్ ఏరియాలో రూ.30 కోట్లు దాటిన రెండు సినిమాలు ఉన్న ఏకైక హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. ఆయన అభిమానులు ఈ వార్తను షేర్ చేస్తుండడంతో ‘దేవర’ హ్యాష్ ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
'దేవర' బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?
ప్రీ సేల్స్ బుకింగ్స్‌లో పలు రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్లో హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.510 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసినట్లు మూవీ టీమ్ తాజాగా తెలిపింది.