Deepika Ranveer Singh Baby :బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంట తాజాగా ఓ పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం దీపిక ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారని తెలుస్తోంది.
సిద్ధివినాయకుని ఆశీర్వాదం
అయితే డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లేకంటే ముందు ఈ జంట వినాయకుడి ఆశీర్వాదం పొందేందుకు వినాయక చవితికి ఒక్కరోజు ముందు, దీపిక, రణ్‌వీర్ ముంబయిలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించారు. గుడిలోకి ఈ జంట చేతులు పట్టుకుని వెళ్లడం కనిపించింది. దీంతో అప్పుడే ఈ దీపిక కొన్ని వారాల్లో మొదటి బిడ్డకు జన్మనిస్తున్నారని, అందరూ అనుకున్నారు. కానీ ఆదివారం పాపను గురించి రివీల్ అవ్వడంతో దీప్‌వీర్ (దీపిక, రణ్‌వీర్) ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
దీపికా పదుకొణె ఆలయానికి వచ్చినప్పుడు ఆకుపచ్చ బనారసీ చీర కట్టుకుంది. ఆమె స్నేహితురాలు, స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అదాజానియా ఈ చీరను బహుమతిగా ఇచ్చింది. శతాబ్దాల నాటి అదే రంగు, ప్యాటర్న్‌తో చీరను డిజైన్ చేసినట్లు సంబంధిత బ్రాండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆరు నెలల తర్వాత చేసిన మొదటి చీరను దీపిక కోసం అనితా ష్రాఫ్ అదాజానియా కొనుగోలు చేసిందని చెప్పింది. చీర ఆకుపచ్చ రంగు సంతానోత్పత్తి, శ్రేయస్సును సూచిస్తుందని ఇది ఆమె సరైన ఎంపికని తెలిపింది. ఆ తర్వాత శనివారం సాయంత్రం దీపిక, రణవీర్ ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు చేరుకున్నారు.