Ranveer Deepika Baby:బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి ఆశీర్వాదం పొందేందుకు శుక్రవారం సిద్ధివినాయక్ ఆలయానికి వచ్చారు. అలానే శనివారం సాయంత్రం దీపిక, రణవీర్ ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. దీంతో దీపిక నేడో, రేపో బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు .
వీడియో వైరల్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోగ్రాఫర్ షేర్ చేసిన వీడియోలో దీపిక ఫేస్ మాస్కు ధరించి తన కారులో కూర్చున్నట్లు కనిపించింది. రణవీర్ సింగ్, అతడి కుటుంబం కొద్దిసేపటికి వారి సొంత వాహనాల్లో రావడం వల్ల దీపిక ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలోనే దీపిక తల్లి కాబోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
వినాయకుడి ఆశీర్వాదం
శుక్రవారం గణేష్ చతుర్థికి ఒక్కరోజు ముందు, దీపిక, రణ్‌వీర్ ముంబయిలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించారు. గుడిలోకి ఈ జంట చేతులు పట్టుకుని వెళ్లడం కనిపించింది. కొన్ని వారాల్లో మొదటి బిడ్డకు జన్మనిస్తున్నారని, అందుకే ఆశీర్వాదం కోసం ఆలయానికి వచ్చారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి ట్విన్స్ పుట్టబోతున్నారంటూ నెటిజన్లు అప్పుడే అంచనా వేసేస్తున్నారు.