Deepika Padukone Kalki 2898 AD :బీటౌన్ బ్యూటీ దీపికా పదుకొణె ఇటీవలే ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టి తన అభిమానులకు, నెటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నానంటూ దీపికా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆమె అభిమానుల్లో ఆనందం నిండిపోయింది. 2024 సెప్టెంబర్లో బయట ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్న తమ బిడ్డ గురించి దీపికా, రణవీర్ సింగ్ దంపతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మామూలు రోజుల్లోనే దీపికా అంటే అమితమైన ప్రేమ ఉన్న రణవీర్ ఇప్పుడు తండ్రి కాబోతున్న ఆనందంలో భార్యపై ప్రేమను వర్షంలా కురిపిస్తున్నారు. ఇదంతా చూడబోతే దీపికా డెలివరీ కూడా బెంగళూరులోనే జరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు దీపికా ఈ నిర్ణయం తీసుకుని అందరినీ షాక్‌కు గురిచేసింది. బాలీవుడ్లో ఓ వెలుగు వెలుగుతున్న ఈ తరుణంలో ఆమె ప్రెగ్నెన్సీ అంటూ సంవత్సరం పాటు దూరం కావడం అభిమానులకు కాస్త షాకింగే. డెలివరీ అయినాక తిరిగి సినిమాల్లోకి వస్తారా ? లేదా అన్న విషయంపై సందిగ్ధత కూడా నెలకొంది.
ఇక దీపికా ప్రెగ్నెన్సీ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటుంది కూడా. సినిమాలకు, యాడ్ లకు మొత్తంగా కెమెరాకు దూరంగా ఉంటూ తన సొంత ప్రపంచానికి వెళ్లిపోయింది. మూడు నెలల గర్భిణీ కావడం వల్ల రెస్ట్ తీసుకుంటూ ప్రశాంతంగా గడిపేస్తానంటోంది. సొంతూరు అయిన బెంగళూరుకు వెళ్లిపోయి అత్త, అమ్మ సలహాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటున్నట్లు బాలీవుడ్ సినిమా మీడియా వెల్లడించింది. ఇక బెంగళూరులోనే బిడ్డ పుట్టనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ కూడా నడుస్తోంది.