తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

డిసెంబర్‌లో అందాల భామల సినిమా జాతర - OTTలోకి రానున్న బడా చిత్రాలివే!

డిసెంబర్​లో OTTలోకి రానున్న టాప్ సినిమాలివే - ఆ భారీ బ్లాక్ బస్టర్ సినిమా కూడా.

December OTT Releases
December OTT Releases (source ETV Bharat and Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 8:42 AM IST

December OTT Releases : నవంబరు నెల మరో రోజులో ముగిసిపోతుంది. డిసెంబర్ ఎంట్రీ ఇస్తుంది. అయితే ఈ నెలలో ఓటీటీలోకి కొన్ని ఆసక్తికరమైన క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్​తకు రెడీ అయ్యాయి. అందులో అమరన్ లాంటి బ్లాక్ బస్టర్​తో పాటు కంగువా లాంటి మిక్స్​డ్​ టాక్​ భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా అసలు ఏఏ సినిమాలు? ఏఏ ఓటీటీలో రానున్నాయో తెలుసుకుందాం.

  • ఆపదలో చిక్కుకున్న తమ వారిని కాపాడేందుకు హీరో/హీరోయిన్లు ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేసి, తమ లక్ష్యాన్ని చేరుకోవడం వంటి కాన్సెప్ట్​తో చాలా చిత్రాలు వచ్చాయి. అలాంటి కోవకు చెందినదే 'జిగ్రా'. 'రాఖీ కట్టాను. నీకేం కాదు. నీకు ఈ అక్క ఉందిగా', జిగ్రాలో తమ్ముడికి అలియా భట్‌ ఇచ్చే భరోసా, అతడి కోసం ప్రతినాయకులతో పోరాటమే ఈ సినిమా. చేయని తప్పుకు తమ్ముడికి పడిన మరణశిక్షను తప్పించేందుకు అక్క ఏం చేసింది? ఎలా పోరాడింది అనేది సినిమాలో చూపించారు. నెట్​ఫ్లిక్స్​లో ఇది రానుంది. డిసెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం.
  • స్కామ్‌ 1992 వెబ్‌ సిరీస్‌తో గుర్తింపు పొందిన ప్రతీక్‌ గాంధీ, ద్వివేందు శర్మ (మీర్జాపూర్​ మున్నా భాయ్​) నటించిన అగ్ని మూవీ డిసెంబర్ 6 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.
  • శివ కార్తికేయన్, సాయి పల్లవి కలిసి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అమరన్. 2014లో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరద రాజన్‌ జీవిత కథతో రూపొందిన చిత్రమే ఈ అమరన్‌. వరదరాజన్‌గా శివ కార్తికేయన్ నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయిపల్లవి నటించారు. డిసెంబర్ తొలి లేదా రెండో వారంలో నెట్‌ఫ్లిక్స్​లో వస్తుందని సమాచారం.
  • వెయ్యేళ్ల కింద‌టి కథ‌కు, వ‌ర్తమానానికి ముడిపెడుతూ తెర‌కెక్కించిన సినిమా కంగువా. లార్జర్‌ దేన్ లైఫ్ ట్రెండ్‌కు త‌గ్గుట్టు ఓ భారీ కాన్వాస్‌తో రూపొందింది. సూర్య ప్రధాన పాత్రలో నటించారు. కానీ ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మిక్స్​డ్ రివ్యూస్​ను అందుకుంది. డిసెంబర్ 13 నుంచి ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కానుంది. దిశా పటానీ హీరోయిన్.
  • మిస్ మ్యాచ్డ్ వెబ్ సిరీస్ సీజన్ 3, డిసెంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది.
  • బాలీవుడ్‌లో సింగమ్‌ చిత్రాల సిరీస్‌ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఆ కోవలోనే మరోసారి వచ్చిందే సింగం అగైన్‌. అజయ్‌ దేవ్‌గణ్‌, కరీనా కపూర్‌ఖాన్‌, రణ్‌వీర్‌సింగ్‌, అక్షయ్‌కుమార్‌, దీపిక పదుకొణె, టైగర్ ష్రాఫ్‌, అర్జున్‌ కపూర్‌ తదితరులు కలిసి నటించారు. డిసెంబర్ 27 నుంచి ప్రైమ్ వీడియోలోకి ఇది రానుంది.
  • కార్తీక్ ఆర్యన్ సూపర్ హిట్ మూవీ భూల్ భులయ్యా 3 కూడా ఓటీటీ రిలీజ్​కు రెడీ అయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో డిసెంబర్​లోనే రానుంది. అనీస్‌ బజ్మీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తీక్‌ సరసన త్రిప్తి దిమ్రీ నటించింది. విద్యాబాలన్‌, మాధురీ దీక్షిత్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.

ABOUT THE AUTHOR

...view details