తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'BB4' దసరా​ బ్లాక్​ బస్టర్​ అప్డేట్​ - షూటింగ్ ఆ రోజు నుంచే ప్రారంభం - BB4 SHOOTING UPDATE

దసరా కానుకగా బాలకృష్ణ - బోయపాటి BB4 గురించి సూపర్​ అప్డేట్​ ఇచ్చిన మేకర్స్​!

source ETV Bharat
Balakrishna Boyapati srinu BB4 shooting (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2024, 11:00 AM IST

Balakrishna Boyapati srinu BB4 shooting :ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు ప్రత్యేక అభిమానులుంటారు. అలాంటి వాటిలో ఒకటి బాలకృష్ణ - బోయపాటిల కలియిక ఒకటి. వీరిద్దరి సినిమా వస్తుందంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'సింహ', 'లెజెండ్‌', 'అఖండ' మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ బ్లాక్​ బస్టర్స్​ను అందుకున్నాయి. అయితే ఇప్పుడు నాలుగోసారి కూడా ఈ మాస్‌ కాంబో రిపీట్‌ కానున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గానే అఫీషియల్​గా ప్రకటించారు.

అయితే తాజాగా దసరా పండగను పురస్కరించుకుని BB4 షూటింగ్ అప్డేట్​ను ఇచ్చారు మేకర్స్. షూటింగ్​కు ప్రారంభానికి ముహార్తాన్ని ఖరారు చేశారు. అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు గ్రాండ్​గా ప్రారంభంకానున్నట్లు తెలిపారు.

"ప్రతి ఒక్కరికీ దసరా శుభాకాంక్షలు. విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని bb4 సెన్సేషనల్ అనౌన్స్​మెంట్​ ఇస్తున్నాం. ఈ మాసివ్ ఎపిక్ కాంబినేషన్ గ్రాండ్ జర్నీ మొదలు కానుంది. అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు ముహూర్తం ఖరారు చేశాం." అని రాసుకొచ్చింది.

14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట BB4 నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, 2021లో ప్రేక్షకుల విడుదలైన అఖండ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్​గా నిలిచింది. దీనికి సీక్వెల్‌ ఉంటుందని బోయపాటి గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడీ #BB4 అఖండనా లేదంటే కొత్త సినిమానా అనేది చాలా రోజులుగా సస్పెన్స్​లో పెట్టారు మేకర్స్. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో.

రూమర్స్​కు ఐశ్వర్యా రాయ్ ఫుల్ స్టాప్​! - ఐదు నెలల తర్వాత రీఎంట్రీ

'మార్టిన్' రివ్యూ - ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details