Daaku Maharaj Twitter Review :నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. ట్రైలర్, సాంగ్స్‌తో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఆదివారం థియేటర్లలో విడుదలైంది. అయితే ఇప్పటికే ఈ సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరీ ఈ సినిమా ఎలా ఉందంటే?
ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, స్టోరీ ఇలా అన్ని ఎలిమెంట్స్ బాగుందని ఓ యూజర్ రాసుకొచ్చారు. మరొకరేమో ఇది మాస్ ఫెస్ట్ అని, బాలయ్య యాక్షన్ అదిరిందని తెలిపారు. ఇక తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని అన్నారు.
ఇంకొకరేమో ఇది ఓ మంచి యాక్షన్ డ్రామా అని చెప్పుకొచ్చారు. బాలయ్య, బాబీ దేఓల్ నటన ఓ రేంజ్లో ఉందని, సినిమాటోగ్రాఫీ వర్క్ బాగుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా, 'సినిమా మాత్రం మీరు ఎంత ఊహించుకుంటారో అంతకుమించి ఉంటుంది' అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉందని, దెబ్బకు థియేటర్లు పగిలిపోతున్నాయని అన్నారు. డైరెక్టర్ బాబీ చాలా అద్భుతంగా తెరకెక్కించారని దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనని కామెంట్ చేశారు.
"అగ్ని ఆగదా శక్తి ఆగదా సుర సుర సురా సురా" అనే బిట్ వచ్చిన ప్రతి ఊర మాస్ సెంటర్లలో ఎవ్వరు సీట్లలో కూర్చోరంటూ మరో యూజర్ సినిమాకు మరింత హైప్ ఇచ్చారు. ఆ బిట్ వచ్చినప్పుడు ఫుల్ విజిల్స్! సీట్లో అస్సలు కూర్చోరని అభిమానులు అంటున్నారు.