Daaku Maharaaj Pre Release Event Balakrishna Speech :'డాకు మహారాజ్'గా సంక్రాంతికి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు నందమూరి నటసింహం బాలకృష్ణ. పండుగ కానుకగా ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డాలస్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. అందులో బాలకృష్ణ సినిమా గురించి చెప్తూనే తన సినీ జర్నీ గురించి మాట్లాడుతూ ఎమోషనలయ్యారు. అభిమానుల ఆశీస్సుల వల్లే ఆయన ఈ స్థానంలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
"నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయింది. ఇది ఓ ప్రపంచ రికార్డు. ఇప్పటివరకు హీరోగా ఎవరూ 50 ఏళ్ల పాటు రాణించలేకపోయారు. ఇండస్ట్రీలోని కొందరు స్టార్స్ కొంతకాలం వరకూ హీరోలుగా చేసినప్పటికీ, ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌కు చేస్తూ వచ్చారు. కానీ, ఓ హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఘనత నాకు దక్కింది. దీనికి ఆ దేవుడి దీవెనలతో పాటు నా తల్లిదండ్రులు, అలాగే ప్రేక్షకుల ఆశీస్సులే కారణం. నందమూరి తారక రామా రావు సూర్యుడితో సమానం. ఎటువంటి సినిమాల్లోనైనా తన పాత్రకు తను జీవం పోసేవారు. ప్రపంచవ్యాప్తంగానూ తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆయన్ను ఫాలో అవుతూనే నన్ను నేను సాన పెట్టుకొని వజ్రంలా మారాను. ఎంతోమంది విమర్శలు చేసినా వాటిని నేను పట్టించుకోలేదు. నాకు ఆధ్యాత్మిక భావం ఎక్కువ ఉంది. ఆ భగవంతుడే నన్ను నడిపిస్తాడని నేను ముందుకుపోతుంటాను. నేను సినిమాల్లోకి వచ్చిన తొలి రోజు మా నాన్నగారు నాకు బొట్టు పెట్టి మరీ దీవించారు. అప్పటినుంచి నేను ఎన్నో సినిమాలు చేస్తూ వస్తున్నాను. ఎన్నో జానర్‌లలో నటించాను. ఫస్ట్ ఇండియన్ సోషియో ఫాంటసీగా 'ఆదిత్య 369' తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను". అని బాలయ్య అన్నారు.
వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాల గురించి, అలాగే వాటిలోని పాత్రల గురించి చాలా డీప్‌గా తెలుసుకుంటున్నానని బాలయ్యా అన్నారు. నా సొంతంగానే నేను నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. 1986లో నేను యాక్ట్ చేసిన 7 సినిమాలు రిలీజైతే అందులో 6 సినిమాలు 50 రోజులు ఆడాయి. మరో సినిమా సుమారు 100 రోజులు ఆడిందని చెప్పారు.