Chiranjeevi Tweet On Thaman :టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ట్రోల్స్‌పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమన్ మాటలు గుండెను తాకేలా ఉన్నాయని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేశారు.
'డియర్ తమన్, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ, మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి'
'ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, కానీ ఆ మాటలు మరొకరిలో స్ఫూర్తి నింపుతాయి. అలాగే ఇంకొకరిని నాశనం చేస్తాయి. కాబట్టి దేనిని ఎంచుకుంటావనేది నీపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది' అని మెగాస్టార్ చిరంజీవి పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీనికి తమన్ కూడా స్పందించారు.