తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'విశ్వంభర' - 68 ఏళ్ల వయసులో జిమ్‌లో మెగాస్టార్ కసరత్తులు - చిరంజీవి జిమ్ వీడియో

Chiranjeevi Jim Video : మెగాస్టార్ చిరంజీవి తాజాగా జిమ్​ వీడియోను పోస్ట్ చేశారు. జిమ్​లో అన్ని రకాల కసరత్తులు చేస్తూ కనిపించారు. 68 ఏళ్ల వయసులో చిరు జిమ్​లో ఈ రేంజ్​లో కష్టపడటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

'విశ్వంభర' - 68 ఏళ్ళ వయసులో జిమ్‌లో మెగాస్టార్ కసరత్తులు
'విశ్వంభర' - 68 ఏళ్ళ వయసులో జిమ్‌లో మెగాస్టార్ కసరత్తులు

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 11:54 AM IST

Updated : Feb 1, 2024, 12:47 PM IST

Chiranjeevi Jim Video : మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులకు కన్నుల పండగే. గత ఏడాది 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్​ హిట్​ అందుకున్న ఆయన ఆ తర్వాత భోళా శంకర్ సినిమాతో వచ్చి పరాజయాన్ని చూశారు. ఈ సినిమా రిజల్ట్​తో బాగా ఆలోచించి సోషియో ఫాంటసీ సినిమాను చేయాలని డిసైడ్ అయ్యారు. అలా ప్రస్తుతం తన 156వ సినిమాగా 'విశ్వంభర' (Vishwambhara Movie) చేస్తున్న సంగతి తెలిసిందే.

బింబిసార డైరెక్టర్​ వశిష్టతో దర్శకత్వంలో రూపొందుతోంది. బియాండ్ యూనివర్స్ అంటూ కొత్త కథతో రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ గ్లింప్స్​ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా మెగాస్టార్(Megastar) తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. 'విశ్వంభర' కోసం రెడీ అవుతున్నాను అంటూ జిమ్​లో చెమటోడుస్తున్న వీడియోను షేర్ చేశారు. జిమ్​లో అన్ని రకాల కసరత్తులు చేస్తూ కనిపించారు. 68 ఏళ్ల వయసులో చిరు జిమ్​లో ఈ రేంజ్​లో కష్టపడటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా సినిమా కోసం చిరంజీవి ఎంత దూరమైనా వెళ్తారనే విషయం తెలిసిందే. సినిమా కోసం 100 శాతం ఎఫెర్ట్స్ పెడతారు. ఎంతైనా కష్టపడతారు. ఇప్పటికే ఈ విషయంలో ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడు 'విశ్వంభర' మూవీ కోసం ఆయన ఈ రేంజ్​లో కష్టపడటం చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. బాసూ నువ్వు ఎప్పటికే గ్రేటే అని ప్రశంసిస్తున్నారు.

విశ్వంభర షూటింగ్ విషయానికొస్తే - ఇప్పటికే రెగ్యులర్‌ చిత్రీకరణను ప్రారంభించుకుంది. కానీ చిరు ఇంకా సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు. త్వరలోనే కొత్త షెడ్యూల్‌తో సెట్స్‌లోకి రానున్నారని సమాచారం. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను మూవీటీమ్​ సిద్ధం చేస్తోందట. అందులో చిరుతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలిసింది. సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఆయనకు జోడీగా ముగ్గురు నాయికలు ఉంటారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. సంగీతం: ఎంఎం కీరవాణి, ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు.

హీరోగా ఎంట్రీగా ఇవ్వనున్న బిగ్​ బాస్​-7 ఫేమ్​ అమర్​దీప్​- హీరోయిన్​ ఎవరంటే?

'ప్రతి పనిలో అతని సహకారం, సలహాలను తీసుకుంటా'- రష్మిక కీలక వ్యాఖ్యలు

Last Updated : Feb 1, 2024, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details