Allu Sirish Buddy Movie : టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. యాక్షన్ థ్రిల్లర్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌తోనే సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 30 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానున్నట్లు తాజాగా ఆ సంస్థ ప్రకటించింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ప్రకటనలో ఉంది.
స్టోరీ ఏంటంటే :
ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలెట్. తన డ్యూటీలో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌తో తరచూ మాట్లాడుతుంటాడు. అప్పుడే అక్కడ పని చేసే పల్లవి (గాయత్రీ భరద్వాజ్)తో అతడికి పరిచయం ఏర్పడుతుంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు చుసుకోనప్పటికీ, ఆ మాటల పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. దీంతో తన మనసులోని మాటను చెప్పేందుకు వెయిట్ చేసే పల్లవికి ఊహించని షాక్ తగులుతుంది. ఓ రోజు ఆమె చేసిన చిన్న తప్పిదం కారణంగా ఆదిత్యను సస్పెండ్ చేస్తారు. తన వల్ల ఉద్యోగం పోయినందుకు గిల్టీగా ఫీల్ అయిన పల్లవి అతడ్ని నేరుగా కలిసి సారీ చెప్పాలనుకుంటుంది. ఇంతలోనే ఆమె కిడ్నాప్‌కు గురవుతుంది. అప్పుడు జరిగిన గొడవలో ఆమె కోమాలోకి వెళ్లగా, తన ఆత్మ ఓ టెడ్డీబేర్‌లోకి చేరుతుంది. అయితే ప్రాణంతో ఉండగానే పల్లవి ఆత్మ అలా బయటకెలా వచ్చింది? ఆమెను కిడ్నాప్ చేసిన ముఠాతో హాంకాంగ్‌లో ఉన్న డాక్టర్ అర్జున్ కుమార్ వర్మ (అజ్మల్)కూ ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు? అన్నదే మిగతా స్టోరీ.