RC 16 Movie :గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్లో డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మువీ 'ఆర్సీ 16' (వర్కింగ్ టైటిల్). ఇటీవల సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి దర్శకుడు బుచ్చిబాబు తాజాగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్క స్టేట్మెంట్తో మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. మరి ఆయన ఏం అన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ నటించిన 'బాపు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరైన బుచ్చిబాబు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన తెరకెక్కించిన తొలి సినిమా 'ఉప్పెన' విడుదల సమయంలో బుచ్చిబాబు తండ్రి థియేటర్ బయట ప్రేక్షకులను రివ్యూ అడిగారట.
'మా ఫ్యామిలీ అంతా రాజమండ్రిలో ఉప్పెన సినిమా చూడడానికి వెళ్లారు. నేను మా అమ్మకు ఫోన్ చేసి నాన్న సినిమా చూశారా అని అడిగాను. అయితే థియేటర్ వరకూ వచ్చిన మా నాన్న లోపలికి వెళ్లలేదంట. గేటు బయట నిలబడి 'సినిమా బాగుందా?' లేదా అని ప్రేక్షకులను అడిగారంట. అయితే నేను ఇప్పుడు రామ్‌చరణ్‌తో తీస్తున్న సినిమాకు అలా అడగాల్సిన అవసరం లేదు. అది పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుంది' అని బుచ్చిబాబు ఆర్సీ 16 సినిమాపై అంచనాలు రెట్టింపు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.