Vivek Oberoi Rejected Movies:2002లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కంపెనీ' మూవీతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు వివేక్ ఒబెరాయ్. ఆ తర్వాత మణిశర్మ మ్యూజికల్ హిట్ 'సఖి' హిందీ రీమేక్ 'సాతీయా'తో అమాంతం స్టార్ డమ్ పెరిగింది. ఆ తర్వాత యూత్‌లో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకోవడం, తాను చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల హీరోగా కెరీర్ ప్రమాదంలో పడే స్థాయికి వచ్చాడు
రిజెక్ట్ చేసిన సినిమాలు!: 'మున్నాభాయి MBBS' ఎంత సూపర్ హిట్టో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ మూవీ ఛాన్స్ సంజయ్ దత్ కన్నా ముందు వివేక్‌కు దక్కింది. ఆ సినిమా వర్క్ షాప్స్ కూడా పాల్గొన్నాడు. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం ఆ చిత్రంలో నటించలేకపోయాడు.
'హమ్ తుమ్' మూవీ ఛాన్స్ కూడా మొదట వివేక్‌నే వరించింది. కానీ అది కూడా వదులుకోవడం వల్ల సైఫ్‌ను తీసుకున్నారు. అయితే ఆ చిత్రానికి సైఫ్‌కు అవార్డు కూడా వచ్చింది. ఇక దీపికా పదుకొణె హీరోయిన్గా పరిచయమైన షారుక్ ఫిల్మ్ 'ఓం శాంతి ఓం'లో అర్జున్ పాత్ర మొదట వివేక్‌కే వచ్చింది. అయితే 'కంపెనీ' లాంటి సినిమా తర్వాత నెగిటివ్ పాత్రలు చేయడం ఇష్టం లేకపోవడం వల్ల అదీ ఒప్పుకోలేదు.