Hyderabad City Central Library For Job Seekers : హైదరాబాద్‌లో ప్రముఖ గ్రంథాలయాల్లో ఒకటి సిటీ సెంట్రల్ లైబ్రరీ. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత నిత్యం పెద్దసంఖ్యలో ఇక్కడకి వచ్చి ప్రిపేర్ అవుతుంటారు. గ్రంథాలయంలో పుస్తకాలు, గ్రంథాలయ సంస్థ ఉచితంగా కల్పించే సౌకర్యాల గురించి తెలియక చాలామంది ఉద్యోగార్థులు అద్దె చెల్లిస్తూ స్టడీ హాళ్లలో చదువుకుంటున్నారు. మళ్లీ వారికి భోజన సదుపాయం అన్ని విడిగా ఉంటాయి. లైబ్రరీలో ఆహారం కూడా పెడతారు. ఉద్యోగార్థుల కోసమే కాకుండా వృద్ధులు, చిన్న పిల్లలకు సైతం ఇక్కడ ప్రత్యేక విభాగాలున్నాయి. సుమారు 2.40 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దిన పత్రికలు ఉంటాయి. వర్తమాన అంశాల గురించి కొన్ని మ్యాగజైన్లు కూడా అందుబాటులో ఉంటాయి.
అందుబాటులో కంప్యూటర్లు, ఇంటర్నెట్ : యువతీయువకులు ఉద్యోగ నోటిఫికేషన్లు, ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి సిటీ సెంట్రల్ లైబ్రరీలో 25 కంప్యూటర్లున్నాయి. సోమవారం, రెండో శనివారం మినహా అన్ని రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5వరకు గుర్తింపు కార్డు చూపించి వాడుకోవచ్చు. గంటకు రూ.5 చెల్లించాలి. పోటీ పరీక్షల కేంద్రాలు నిర్వహించే ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు ఉచిత హైస్పీడ్ వైఫై కూడా ఉంటుంది. ఉద్యోగార్థులు వాడుకుని క్లాసులు వినొచ్చు.
పల్లెటూరిలో 'లక్కీ' లైబ్రరీ- ఒకే ఏడాదిలో 19మందికి జాబ్స్!
సభ్యత్వం తీసుకుంటే : రూ.150తో సభ్యత్వం (మెంబర్ షిప్) తీసుకుంటే పుస్తకాలు అక్కడే ఉండి చదువుకోవడమే కాకుండా ఇంటికి తీసుకెళ్లి చదివే వెసులుబాటు ఉంటుంది. రూ.1,250 విలువ గల పోటీ పరీక్షల పుస్తకాలనూ తీసుకెళ్లి ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వొచ్చు.
పుస్తకాలతో పాటు దినపత్రికలు : ఇక్కడ మాస, వార, దిన పత్రికలు అందుబాటులో ఉంటాయి. తత్వశాస్త్ర పుస్తకాలు, నవలలు, జీవిత చరిత్రలు, చారిత్రక, ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, శాస్త్రసాంకేతిక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 8 భాషల దినపత్రికలు చదువుకోవచ్చు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు కేటాయించిన ప్రత్యేక ప్రదేశాల్లో ఆయా విభాగాల వారికి అవసరమైన పుస్తకాలు ఉన్నాయి.
ఈ లైబ్రరీల్లో 'చదువు' ఒక్కటే కాదు - అంతకు మించి ఎన్నో సేవలు - Free Library in Hanamkonda
లీడ్ చిల్డ్రన్ లైబ్రరీ పేరిట గ్రంథాలయం - చదువే ఆయుధంగా విద్యార్థులకు తోడ్పడుతున్న జంట